Homeఎంటర్టైన్మెంట్Deepika Padukone Kalki 2: మంచి గుణపాఠం నేర్పించారు అంటూ 'కల్కి' మేకర్స్ పై మండిపడ్డ...

Deepika Padukone Kalki 2: మంచి గుణపాఠం నేర్పించారు అంటూ ‘కల్కి’ మేకర్స్ పై మండిపడ్డ దీపికా పదుకొనే!

Deepika Padukone Kalki 2: మొన్న స్పిరిట్..నిన్న కల్కి..ఇలా దీపికా పదుకొనే(Deepika Padukone) ప్రతీ సారి ప్రభాస్(Rebel Star Prabhas) సినిమాలకే ఎందుకు అన్ని డిమాండ్స్ పెడుతుందో అసలు అర్థం కావడం లేదు. స్పిరిట్ చిత్రానికి ముందుగా డైరెక్టర్ సందీప్ వంగ(Sandeep Reddy Vanga) ఈమెనే హీరోయిన్ రోల్ కోసం సంప్రదించాడు. కానీ ఆమె అడిగిన డిమాండ్స్ ని తీర్చలేక ఆమెని కాకుండా వేరే హీరోయిన్ ని తీసుకున్నాడు. దీంతో కోపగించుకున్న దీపికా పదుకొనే తన పీఆర్ […]

Deepika Padukone Kalki 2: మొన్న స్పిరిట్..నిన్న కల్కి..ఇలా దీపికా పదుకొనే(Deepika Padukone) ప్రతీ సారి ప్రభాస్(Rebel Star Prabhas) సినిమాలకే ఎందుకు అన్ని డిమాండ్స్ పెడుతుందో అసలు అర్థం కావడం లేదు. స్పిరిట్ చిత్రానికి ముందుగా డైరెక్టర్ సందీప్ వంగ(Sandeep Reddy Vanga) ఈమెనే హీరోయిన్ రోల్ కోసం సంప్రదించాడు. కానీ ఆమె అడిగిన డిమాండ్స్ ని తీర్చలేక ఆమెని కాకుండా వేరే హీరోయిన్ ని తీసుకున్నాడు. దీంతో కోపగించుకున్న దీపికా పదుకొనే తన పీఆర్ టీం తో స్పిరిట్ మూవీ స్టోరీ లైన్ ని లీక్ చేయించిందని డైరెక్టర్ సందీప్ వంగ ఆమె పై బహిరంగంగా ఫైర్ అవుతూ ఒక ట్వీట్ వేసాడు. అది పెద్ద సంచలనంగా మారింది. ఇక కల్కి చిత్రం లో ఈమె హీరోయిన్ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కల్కి సీక్వెల్ లో కూడా ఆమెనే హీరోయిన్ అని అనుకున్నారు. కానీ ఆమె స్పిరిట్ చిత్రానికి ఎలాంటి డిమాండ్స్ అయితే పెట్టిందో, కల్కి సీక్వెల్ కి కూడా అలాంటి డిమాండ్స్ పెట్టింది.

Also Read: డిమోన్ పవన్ కెప్టెన్ పదవి అవుట్.. ఓనర్స్ ని టెనెంట్స్ గా మార్చేసిన నాగార్జున!

ఇంత గొప్ప చిత్రంలో నటించాలంటే డెడికేషన్ చాలా ఉండాలి, అది నీలో లేదు అని చెప్పి మరీ పీకేశారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఒక టాప్ హీరోయిన్ పై దర్శక నిర్మాతలు ఇంతటి తీవ్రమైన అసహనం వ్యక్తం చేయడం ఎప్పుడూ చూడలేదు. దీనిపై ఆమె స్పందన కోసం నెటిజెన్స్ ఎంతగానో ఎదురు చూసారు. చివరికి నిన్న ఆమె పరోక్షంగా రెస్పాన్స్ ఇచ్చింది. ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ’18 ఏళ్ళ క్రితం ‘ఓం శాంతి ఓం’ చిత్రం ద్వారా నేను వెండితెర కి పరిచయం అయ్యాను. ఆ సినిమా షూటింగ్ సమయం లో హీరో షారుఖ్ ఖాన్ నుండి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ప్రతీ సినిమా నా కెరీర్ లో ఒక కొత్త పాఠాన్ని నేర్పించింది. నేను తీసుకునే ప్రతీ నిర్ణయం వెనుక ఆ పాఠాన్నే అమలు చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.

అంటే కల్కి చిత్రం అనుభవం నుండి కూడా నేను పాఠాలు నేర్చుకున్నాను అని పరోక్షంగా చెప్పకనే చెప్పింది దీపికా పదుకొనే. అంటే ఈమె నేర్చుకున్న పాఠాలు ఏంటి?, ఒక సినిమా లో నటించడానికి రెమ్యూనరేషన్ కి బదులుగా 50 శాతం కి పైగా వాటాలు కావాలని అడగడమా?, కేవలం 5 గంటలు మాత్రమే పని చేస్తాను అని కండిషన్స్ పెట్టడమా?, తనతో పాటు స్టాఫ్ కి రాయల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరడమా?, ఇవేనా ఆమె నేర్చుకున్న పాఠాలు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈమె అల్లు అర్జున్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అక్కడ కూడా నిర్మాతలు ఈమె పెట్టిన కండీషన్స్ కి ఒప్పుకున్నారా?, అసలు ఎలా వర్కౌట్ అవుతుంది?, కేవలం ప్రభాస్ సినిమాలకు మాత్రమే ఇలాంటివి చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper