Norma: సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకుడి మీదే ఏదో ఒక రకమైన ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. చాలామంది వాళ్లకు ఉన్న ప్రాబ్లమ్స్ ని మర్చిపోయి కాసేపు రిలాక్స్ అవ్వడానికి సినిమాలను చూస్తుంటారు. మరి ఇలాంటి క్రమంలోనే దర్శకుడు ప్రేక్షకులను ఎలా ఎంటర్ టైన్ చేశాడు అనేదే కీలకం…ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప సినిమాలు వస్తున్నాయి. ఇక ఇతర దేశాల నుంచి కూడా వస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆదరిస్తున్నాయి. ప్రస్తుతం ‘నోర్మా’ సినిమా అయితే ఇండోనేషియా ప్రేక్షకులను ఒక మోస్తారు స్థాయిలో ఎంటర్ టైన్ చేసింది. అలాగే అక్కడి ప్రేక్షకులు ఆ సినిమా గురించి చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అసలు ఆ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటి? అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం…
Also Read: ట్రంప్ నిర్ణయం.. భారతీయులకు ఇంత ఆనందమా?
‘నోర్మా’ అనే సినిమా ఇండోనేషియా ప్రేక్షకులు మాట్లాడుకునే స్థాయిలో ఇంప్రెస్ చేసింది. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది అంటే ఒక వైవాహిక జీవితంలో ఉన్న మహిళ యొక్క భర్త భార్య తల్లితో అక్రమ సంబంధం పెట్టుకోవడం లాంటి కొన్ని సెన్సిటివ్ విషయాలను ఈ సినిమాలో చర్చించారు.
ఇక ఇందులో కొన్ని మెలో డ్రామా సన్నివేశాలతో కూడిన సీన్స్ ఉండటం…ఈ సినిమాని చూసిన ప్రతి ప్రేక్షకుడు ఈ మూవీ గురించి చాలా డీప్ గా డిస్కషన్ అయితే చేస్తున్నాడు. ఇక ముఖ్యంగా ఈ సినిమా గురించి అంత గొప్పగా మాట్లాడుకోవడానికి ఏముంది అనే డౌట్ మనలో ప్రతి ఒక్కరికి రావచ్చు. కానీ ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందనే ఒక న్యూస్ తెలియడంతో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడడానికి ఎక్కువ ఆసక్తి చూపించారు. అలాగే ఈ మూవీ గురించి డిస్కస్ చేయడానికి కూడా చాలా వరకు సమయాన్ని కేటాయిస్తున్నారు.
2022వ సంవత్సరంలో ‘నోర్మా రిస్మా’ అనే మహిళ టిక్ టాక్ లో తన వైవాహిక జీవితం గురించి చెప్పింది. తన భర్త కి నోర్మా మహిళ యొక్క తల్లి తో అక్రమ సంబంధం ఉందని అంటే తన భర్త అత్త అయిన మా అమ్మ తో సంబంధం పెట్టుకున్నాడని ఆమె చెప్పడం అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక ఆ కథతోనే ఇప్పుడు నోర్మా అనే సినిమా తెరకెక్కింది…అందుకే ఈ సినిమా ఇండోనేషియా ప్రేక్షకుల్లో ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తోంది…