Daku Maharaj : సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాలలో సూపర్ హిట్ గా నిల్చిన చిత్రం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరో గా నటించిన ‘డాకు మహారాజ్'(Daaku Maharaj Movie). వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత విడుదలైన ఈ సినిమా కి ఓపెనింగ్స్ అయితే గట్టిగానే వచ్చాయి కానీ, క్లోజింగ్ లో మాత్రం ఊహించినంత వసూళ్లు రాలేదు అనేది వాస్తవం. పండగ సెలవుల తర్వాత ఈ చిత్రానికి వసూళ్లు బాగా తగ్గిపోయాయి. ఇదే సంక్రాంతికి విడుదలైన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ, ఆ సినిమాకి వచ్చినంత వసూళ్లు, ఈ చిత్రానికి రాలేదు. కేవలం 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాకి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడానికి ప్రధాన కారణం విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) చిత్రమని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టడం వల్ల ‘డాకు మహారాజ్’ ని పట్టించుకోలేదు.
Also Read : పాకిస్థాన్ లో ‘డాకు మహారాజ్’ మేనియా..ఇది ఇప్పట్లో ఆగేలా లేదు..ఇదేమి మాస్ ర్యాంపేజ్ సామీ!
ఈ సినిమా ఫలితంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ(Naga Vamsi) నిన్న జరిగిన ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ‘ లక్కీ భాస్కర్, డాకు మహారాజ్ చిత్రాలు వేరే లెవెల్లో వసూళ్లు రాబట్టాల్సినవి. లక్కీ భాస్కర్ కి ముందుగానే ఊహించాము, ఇది కేవలం ఒక సెట్ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అవుతుంది, మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టేస్తారు అనుకున్నాం. అనుకున్నట్టు గానే మంచి లాంగ్ రన్ వచ్చింది కానీ, అదే సమయంలో ‘అమరన్’ లాంటి మల్టీప్లెక్స్ థియేటర్స్ బొమ్మ రావడంతో ఆడియన్స్ డివైడ్ అయ్యారు. ‘డాకు మహారాజ్’ ఫలితం అయితే నన్ను బాగా నిరాశపరిచింది. మంచి బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఉన్న సినిమా అది. వెంకటేష్ గారి సినిమా పెద్ద హిట్ అవ్వడంతో పండగ అయిపోయిన తర్వాత ఆడియన్స్ ఆ సినిమాకే పట్టం కట్టారు.పండగ తర్వాత మా సినిమా వసూళ్లు బాగా పడిపోయాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘కానీ బాలయ్య గారి సినిమాలకు దుమ్ము లేపే సెంటర్స్ అన్నిట్లో ‘డాకు మహారాజ్’ చిత్రం చితక్కొట్టేసింది. ఓటీటీ లో విడుదలయ్యాక ఈ సినిమాకి వస్తున్నా రెస్పాన్స్ కి చాలా ఆనందంగా ఉంది. ఓటీటీ లో ఈ సినిమా లాంగ్ రన్ లో ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పొచు’ అంటూ చెప్పుకొచ్చాడు. వంశీ చెప్పినట్టు గానే ‘డాకు మహారాజ్’ చిత్రానికి ఓటీటీ లో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు సోషల్ మీడియా లో తిరుగుతూనే ఉన్నాయి. నెటిజెన్స్ పదే పదే ఆ వీడియోలను షేర్ చేస్తూ డైరెక్టర్ బాబీ ని, హీరో బాలయ్య బాబు , మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ని పొగుడుతూనే ఉన్నారు. అసలు ఎలాంటి డ్రా బ్యాక్ లేకుండా తెరకెక్కిన ఏకైక బాలయ్య సినిమా అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read : ‘డాకు మహారాజ్’ హిందీ వెర్షన్ క్లోజింగ్ వసూళ్లు..బాలయ్య పరువు తీసిన నిర్మాత నాగవంశీ!