Daku Maharaj : మన తెలుగు సినిమాలకు ఇతర దేశాల్లో యమ క్రేజ్ ఉంది అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాహుబలి సిరీస్ తర్వాత మన మార్కెట్ పరిధి కి హద్దులు లేకుండా పోయాయి. అదే విధంగా ఓటీటీ వృద్ధిలోకి వచ్చిన తర్వాత మన సినిమాలు ఇప్పుడు హాలీవుడ్ తో పోటీ పడుతున్నాయి. #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డు వచ్చిందంటే థియేట్రికల్ రిలీజ్ వల్ల వచ్చిన రీచ్ తో కాదు, నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన రీచ్ వల్ల అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అరబ్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్ ఈ చిత్రాన్ని ఎగబడి చూసారు. కేవలం #RRR కి మాత్రమే కాదు, ఇతర హీరోల సినిమాలకు కూడా దేశవ్యాప్తంగా అలాంటి రీచ్ వచ్చింది. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చిన ‘పుష్ప 2’ కూడా అలాంటిదే. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ‘డాకు మహారాజ్'(Daaku Maharaj Movie) చిత్రం చేరింది.
Also Read : ‘డాకు మహారాజ్’ 18 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆంధ్రలో లాభాలు..నైజాం, సీడెడ్ లో భారీ నష్టాలు!
భారీ అంచనాల నడుమ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని లేటెస్ట్ గా నెట్ ఫ్లిక్స్(Netflix) లో తెలుగు తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా విడుదల చేసారు. రెస్పాన్స్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ టాప్ లో ట్రెండ్ అవుతూ సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పాకిస్తాన్(Pakistan) దేశంలో మూవీ లవర్స్ ఈ చిత్రాన్ని ఎగబడి మరీ చూస్తున్నారు. ఆ ప్రాంతంలో ఈ చిత్రం నెంబర్ 1 స్థానం లో నిల్చింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది. కేవలం పాకితం ప్రాంతం నుండి ఈ సినిమాకి 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయట. ఫుల్ రన్ లో ఇక్కడి నుండి 2 మిలియన్ వ్యూస్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల్లో ట్రెండ్ అవుతున్న ఈ సినిమా కచ్చితంగా ఫుల్ రన్ లో రికార్డులు నెలకొల్పుతుంది అనే బలమైన నమ్మకంతో ఉన్నారు మేకర్స్. #RRR , లక్కీ భాస్కర్, దేవర మహారాజ వంటి చిత్రాలు నెట్ ఫ్లిక్స్ లో 9 వారాలకు పైగా టాప్ లో ట్రెండ్ అయ్యాయి. ‘డాకు మహారాజ్’ కూడా ఆ లిస్ట్ లోకి చేరే అవకాశం ఉంది. మొదటి వారం లో ఈ చిత్రానికి అన్ని భాషలకు కలిపి 25 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇది దేవర మొదటి వారం వ్యూస్ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. థియేటర్స్ లో సూపర్ హిట్ అయ్యినప్పటికీ, ఈ సినిమా కంటెంట్ కి ఉన్న పొటెన్షియల్ కి తగ్గ సినిమా కాదని అభిమానుల అభిప్రాయం. కానీ ఓటీటీ లో వస్తున్న రెస్పాన్స్ ని చూసి అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.
Also Read : ‘డాకు మహారాజ్’ హిందీ వెర్షన్ క్లోజింగ్ వసూళ్లు..బాలయ్య పరువు తీసిన నిర్మాత నాగవంశీ!