Kalki 2: కల్కి 2 కథ మీద వస్తున్న విమర్శలు… అలా ఎలా రాశాడు..?

Kalki 2: ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకి సీక్వెల్ గా కల్కి 2 సినిమా కూడా రాబోతుందనే విషయం మనందరికీ తెలిసిందే..

Written By: Gopi, Updated On : July 6, 2024 3:30 pm

Criticism coming on Kalki 2 story

Follow us on

Kalki 2: కొన్ని సినిమాలు చూస్తున్నంత సేపు ప్రేక్షకుడిని ఏదో ఒక తెలియని అనుభూతిని పొందేలా చేస్తాయి. అలాంటి సినిమాలని రిపిటేడ్ గా చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే రీసెంట్ గా ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా కూడా ఈకోవకే చెందుతుంది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు.

అలాగే మరోసారి కూడా ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకి సీక్వెల్ గా కల్కి 2 సినిమా కూడా రాబోతుందనే విషయం మనందరికీ తెలిసిందే.. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన 20 రోజులు షూటింగ్ కూడా ఇంతకుముందే కంప్లీట్ చేశారట. మరి మిగతా బ్యాలెన్స్ షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనే విషయం మీద రీసెంట్ గా నాగ్ అశ్విన్ స్పందిస్తూ అది తొందర్లోనే వెల్లడిస్తాం అంటూ ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు. ఇక ఇదిలా ఉంటే కల్కి సినిమా క్లైమాక్స్ లో ప్రభాస్ కర్ణుడిగా కనిపించాడు. అలాగే అర్జునుడి ‘గాండీవం’ విలన్ చేతిలోకి వెళ్తుంది.

ఇక దీనివల్ల సెకండ్ పార్ట్ లో విలన్ అయిన కలి గాండీవంతో యుద్ధం చేస్తే ప్రభాస్ కర్ణుడిగా పోరాటం చేస్తాడా? అసలు కర్ణుడికి కల్కి ఎంట్రీ కి సంబంధం ఏముంది. పురాణాల్లో ఎక్కడ కూడా కల్కి వచ్చే సమయంలో కర్ణుడు ఎంట్రీ ఇస్తాడు అనేది రాసి లేదు. మరి అలాంటప్పుడు వీళ్ళు కల్కి సినిమాలో కర్ణుడిని ఎందుకు చూపించారు. ఇక సెకండ్ పార్ట్ లో కర్ణుడు అర్జునుడు కంటే గొప్పవాడు అని చూపించే ప్రయత్నం అయితే జరుగుతుంది. నిజానికి మహాభారతంలో జరిగిన ఎపిసోడ్ ని యాజ్ ఇట్ ఇజ్ గా తీయకుండా ఫిక్షన్ స్టోరీలను రాసుకొని సినిమాను తీస్తున్నారు అంటూ సినీ విమర్శకులు సైతం నాగ్ అశ్విన్ మీద ఫైర్ అవుతున్నారు.

కురుక్షేత్రం జరగడానికి కారణమైన కర్ణుడి ని హీరోగా చేసి చూపించాలని ఎలా అనిపించింది. అంటూ వాళ్ళ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. మరి కల్కి 2 సినిమా స్టోరీ మార్చే ఆలోచనలో నాగ్ అశ్విన్ ఉన్నాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి కల్కి 2 సినిమా వస్తే ఎన్ని విమర్శలను ఎదుర్కొంటుంది అనేది…