https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున తో పాటు మరో హీరో కూడా రాబోతున్నాడా..?

Bigg Boss 8 Telugu: నాగార్జునతో పాటు మరొక హోస్ట్ ఎవరు అనే విషయం మీద పలురకాల ఆసక్తికరమైన చర్చలైతే జరుగుతున్నాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జునతో పాటు మరో హీరో ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 6, 2024 / 03:45 PM IST

    Is another hero also coming along with Nagarjuna as the host of Bigg Boss

    Follow us on

    Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 తొందర్లోనే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ షో కి హోస్టుగా నాగార్జున వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సీజన్ ను కొంచెం చేంజ్ చేసి ఒకే వేదిక పైన ఇద్దరు హోస్టులను పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నాగార్జునతో పాటు మరొక హోస్ట్ ఎవరు అనే విషయం మీద పలురకాల ఆసక్తికరమైన చర్చలైతే జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జునతో పాటు నాని కూడా ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తాడు.

    అని కొంతమంది అంటుంటే, ఇక మరి కొంతమంది మాత్రం నాగార్జునతో పాటు రానా హోస్టింగ్ చేస్తాడు అంటున్నారు. ఇక ఇంకొంతమంది అయితే నాగార్జున తో పాటు నవదీప్ కూడా హోస్టింగ్ చేస్తాడు అనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి… నిజానికి ఈ సీజన్ లో ఇద్దరు హోస్టులను పెట్టాలనే ఆలోచనలో మేనేజ్ మెంట్ ఉన్నప్పటికీ, నాగార్జున తో పాటు హోస్టింగ్ చేసే మరో స్టార్ హీరో ఎవరు అనేది మాత్రం వాళ్ళు ఇప్పుడు బయటకు రివిల్ చేయడం లేదు.

    ఇక అంచనా ప్రకారం అయితే నాని గానీ, రానా గాని ఈ షో కి హోస్ట్ గా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా మాట్లాడతారు. ఇక ఇంతకుముందు హోస్ట్ గా చేసిన అనుభవం ఉంది. కాబట్టి వాళ్లయితేనే హోస్టింగ్ కి న్యాయం చేయగలరనే ఉద్దేశ్యం తో వాళ్ళని రంగంలోకి దింపబోతున్నట్టుగా తెలుస్తుంది.

    గత రెండు సీజన్లు కూడా బిగ్ బాస్ షో అంత పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు. కాబట్టి ఈ సీజన్ లో సూపర్ సక్సెస్ సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక గత అన్ని సీజన్ల కంటే కూడా ఈ సీజన్ లో చాలా వెరైటీ కాన్సెప్ట్ లను డిజైన్ చేసి ముందుకు వెళ్తూన్నట్టుగా తెలుస్తుంది…