https://oktelugu.com/

Star Heroine: సాయి పల్లవి నిత్య మీనన్ బాటలోనే నడుస్తున్న మరో స్టార్ హీరోయిన్…

Star Heroine: కొంతమంది హీరోయిన్స్ మాత్రం కొన్ని సీన్లలో నటించకుండా సెలెక్టెడ్ సినిమాలను మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయిన వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి అంటే వాళ్ళు తన నటనతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : July 6, 2024 / 03:25 PM IST

    Another star heroine walking in the footsteps of Sai Pallavi and Nithya Menon

    Follow us on

    Star Heroine: సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా చేసే నటీమణులు ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటప్పుడే వాళ్ల కెరియర్ కి గ్రోత్ ఉంటుంది. లేకపోతే మాత్రం ఇక్కడ అవకాశాలు అంతగా రావు అని చెప్పడానికి చాలామంది హీరోయిన్లను మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు.

    ఇలాంటి క్రమం లోనే కొంతమంది హీరోయిన్స్ మాత్రం కొన్ని సీన్లలో నటించకుండా సెలెక్టెడ్ సినిమాలను మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయిన వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి అంటే వాళ్ళు తన నటనతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి వాళ్లలో సాయి పల్లవి, నిత్యామీనన్ లాంటివారు ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళు ముద్దు సీన్లు, రొమాంటిక్ సీన్లు,ఎక్స్పోజింగ్ సీన్లలో నటించడానికి అసలు ఇష్టపడరు.

    ఒకవేళ స్క్రిప్ట్ లో అలాంటివి ఉంటే వాళ్ళు ఆ సినిమాని సైతం రిజెక్ట్ చేసి క్లీన్ యు సర్టిఫికెట్ ఉండే సినిమాల్లో మాత్రమే నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం వీళ్ళ సరసన మరొక నటి కూడా చేరింది ఆమె శృతి శర్మ. మొదట బాలీవుడ్ టెలివిజన్ రంగంలో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత 2019వ సంవత్సరంలో తెలుగులో వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా తర్వాత ఆమెకి చాలా ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిలో ఎక్కువ పాత్రలు గ్లామర్ షో కి సంబంధించినవే ఉండడం వల్ల వాటిని రిజక్ట్ చేసినట్టుగా తను ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. అలాగే బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అయిన ‘సంజలీలా భన్సాలీ’ డైరెక్షన్ లో రీసెంట్ గా వచ్చిన ‘హిరమండి ‘ సిరీస్ లో కూడా తను ఒక చిన్న పాత్రలో నటించి మెప్పించింది.

    ఇక ఆమెను ఈ సిరీస్ కోసం అడిగినప్పుడు ఆమె ఓకే చెప్పిందట. తీరా సినిమా సెట్ కి వెళ్లి చూస్తే సీన్ పేపర్లో ముద్దు సీన్ ఉండడంతో ఆమె ఆ సీన్ పేపర్ ను చదువుకుంటూ ఏడ్చేసిందట. దాంతో అది గమనించి డైరెక్టర్ తనకు ముద్దు సీన్ లేకుండా చేసి నార్మల్ సీన్లలో మాత్రమే తనను నటింపజేసేలా స్క్రిప్ట్ చేంజ్ చేశారట. ఇక శృతి శర్మ ఇప్పటికీ కూడా కొన్ని లిమిటేషన్స్ ను పెట్టుకొని ఇండస్ట్రీలో ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తుంది.

    నిజానికి ఇలాంటి లిమిటేషన్స్ ఉన్నవారిని దర్శక నిర్మాతలు ఎక్కువగా ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే ఇండస్ట్రీలో పెద్ద హీరోలతో సినిమాలు చేసే హీరోయిన్లు హీరోలకు ఫ్లెక్స్ బిల్ గా ఉంటేనే స్క్రీన్ మీద కెమిస్ట్రీ అనేది బాగా వర్కౌట్ అవుతుందని నమ్ముతారు. కాబట్టి ఇలాంటి వారికి ఎక్కువగా అవకాశాలు ఇవ్వకపోవచ్చు. ఇక మొత్తానికైతే శృతి శర్మ కూడా వచ్చిన ఆఫర్స్ ని రిజెక్ట్ చేసినందుకు ఏ మాత్రం బాధపడటం లేదట. ఎందుకంటే అలాంటి క్యారెక్టర్లు చేసే కంటే కామ్ గా ఉంది బెటరని తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. ఇక అలాగే ఆమె ప్రస్తుతం టెలివిజన్ రంగంలోకి మళ్లీ అరంగేట్రం చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… అక్కడ అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కంఫర్ట్ జోన్ లో నటించవచ్చు అనే ఉద్దేశ్యం లో ఆమె ఉన్నట్టుగా తెలుస్తుంది…