Homeఎంటర్టైన్మెంట్స్టార్ రైటర్ ను బూతులు తిట్టిన క్రియేటివ్ డైరెక్టర్ !

స్టార్ రైటర్ ను బూతులు తిట్టిన క్రియేటివ్ డైరెక్టర్ !

Directorటాలీవుడ్ లో ప్రస్తుతం మాటల రచయితగా క్రేజ్ ఉన్న రైటర్ ఆయన. ఈ లాక్ డౌన్ లో నాలుగు సినిమాలకు డైలాగ్ లను ఫినిష్ చేశారు. దాంతో సహజంగానే పని ఒత్తిడి పెరిగింది. ఆ కారణంగా తనకు మొదటి అవకాశం ఇచ్చి, తనను ఇండస్ట్రీలో నిలబెట్టిన ఓ డైరెక్టర్ సినిమాకి మొదట అనుకున్న డేట్ ప్రకారం వర్క్ ను అందించలేకపోయాడు. దాంతో ఆ క్రియేటివ్ డైరెక్టర్ కి కోపం కట్టలు తెచ్చుకుంది.

నా వల్ల ఇండస్ట్రీలో ఎదిగి, నేను పేరు వేయడం వల్ల రైటర్ అయి, ఇప్పుడు నా సినిమాకే సరిగ్గా వర్క్ చేయడా ? అంటూ ఆ స్టార్ రైటర్ షేక్ అయ్యేలా సీరియస్ అయ్యాడు. డైరెక్టర్ కోపాన్ని ఓపికతో భరించిన ఆ రచయిత, ఆ డైరెక్టర్ సినిమాకి సంబదించిన డైలాగ్ వెర్షన్ ను స్పీడ్ గా ఫినిష్ చేసుకుని తీసుకెళ్లాడు. అవమానించడానికి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆ దర్శకుడికి, ఇది మహా అవకాశంలా అనిపించింది.

ఇవి చెత్త డైలాగ్స్ అంటూ ఆ స్టార్ రైటర్ ను తీవ్రంగా అవమానించాడు. మీరు జీవితంలో కామెడీ రాయలేరు అంటూ దారుణంగా హేళన చేశాడు. చేతిలో రెండు క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నా.. ఆ రైటర్ మాత్రం అనామకుడిగానే ఆ డైరెక్టర్ చేతిలో బూతులు తింటూ మౌనంగా ఉండిపోయాడు, మాట మాత్రం ఎదురు పలకలేదు. ఆ రచయితకి కాస్త లౌక్యం ఎక్కువ లేండి.

పైగా తనకు కేరాఫ్ అడ్రస్ లేనప్పుడు ఈ దర్శకుడే లైఫ్ ఇచ్చాడు. పైగా వీరిది హిట్ కాంబినేషన్. ఇలాంటి కలయికను ఆవేశంలో చెడ పెట్టకూడదు అనేది రచయిత ప్లాన్. ఎలాగూ కోపం తగ్గాక, డైరెక్టర్ సారీ చెబుతాడు. ఎందుకంటే, తిట్టడం, ఆ తర్వాత సారీ చెప్పడం ఆ డైరెక్టర్ కి షాట్ తో పెట్టిన విద్య. ఇవన్నీ ఆలోచించే మొత్తానికి ఆ స్టార్ రైటర్ సైలెంట్ గా తిట్లు తిని నవ్వుతూ బయటకు వచ్చాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular