టాలీవుడ్ లో ఒక హీరోయిన్ చకచకా అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ఆమెకు చాల క్వాలిటీస్ ఉండాలి. అలాగే ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో ఆ హీరోయిన్ కి తెలియాలి. అయితే తాజాగా టాలీవుడ్ లో ఒక అప్ కమింగ్ హీరోయిన్ కు ఈ విద్య బహు బాగా వచ్చు అని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ కుర్ర హీరోయిన్ సినిమా సూపర్ హిట్ అయింది, పైగా ఆ సినిమాలో అమ్మడు యాక్టింగ్ అదిరిపోయింది కాబట్టి, ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నాయని అనుకోవచ్చు. కానీ ఈ బ్యూటీకి వస్తున్న క్రేజీ ఆఫర్లు వెనుక ఈమెకు వచ్చిన హిట్ కంటే కూడా.. ఈ బ్యూటీకి ఉన్న టాలెంటే ఎక్కువ కారణమట. ఇది కూడా నిజమే. ఎందుకంటే.. ఈ యంగ్ హీరోయిన్ మొదటి సినిమా రిలీజ్ కాకముందే, నాని సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.
తాజాగా మరో సినిమా ఒప్పుకుంది. ఆ సినిమాతో ఓ స్టార్ డైరక్టర్ ను తెగ ఆకట్టుకుందట. ఆ స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడు. తన సినిమాలో ఈ యంగ్ హీరోయిన్ కి అవకాశం ఇస్తాను అని ఆమెకు అభయం కూడా ఇచ్చాడట. కాకపోతే పవన్ కళ్యాణ్ కి ఈ బ్యూటీ హీరోయిన్ గా సెట్ అవ్వదు.
కానీ ఈమె కోసం సదరు స్టార్ డైరెక్టర్ ఓ కీలక పాత్ర రాశాడు. పవన్ అన్నయ్య కుమార్తెగా ఆమె నటిస్తోంది. సినిమాలో పవన్ తర్వాత ఆమెకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అన్నమాట. పైగా ఆ స్టార్ డైరెక్టర్ రికమెండేషన్ తో ఈ బ్యూటీకి మరో క్రేజీ సినిమాలో కూడా హీరోయిన్ గా చాన్స్ వచ్చిందని టాక్. నిజానికి ఈ బ్యూటీకి ఇంకా కొంతమంది సినీ ప్రముఖులు కూడా రికమెండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి చిన్న వయసులోనే ఈ బ్యూటీ అంతమందిని ఎలా ఆకట్టుకుందో ?
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Crazy heroine as pawan kalyans daughter
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com