Paradise movie conspiracy: హీరో నాని ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న చిత్రం ది పారడైజ్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు. కాగా వరుస లీక్స్ ది పారడైజ్ చిత్ర యూనిట్ ని ఇబ్బంది పెడుతున్నాయి. కీలక విషయాలు బయటకు రావడంతో దర్శక, నిర్మాతలు తలలు పెట్టుకుంటున్నారు. ఇంతకీ ది పారడైజ్ మూవీ నుండి లీక్స్ ఇస్తున్నది ఎవరు?
Also Read: రామ్ చరణ్ ని చూసి వెనక్కి తగ్గేది లేదంటున్న నాని..టాలీవుడ్ లో మరో సంచలనం!
నాచురల్ స్టార్ నాని(Hero Nani) కెరీర్లో దసరా అతిపెద్ద హిట్. డీగ్లామర్ రోల్ లో నాని అద్భుతం చేశాడు. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరా చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. తనకు భారీ విజయాన్ని కట్టబెట్టిన శ్రీకాంత్ ఓదెలకు(Srikanth Odela) మరో ఛాన్స్ ఇచ్చాడు నాని. ఈసారి శ్రీకాంత్ ఓదెల హీరో నానిని రా అండ్ రస్టిక్ పాత్రలో ప్రెజెంట్ చేస్తున్నాడు. ది పారడైజ్ అనే టైటిల్ కొత్తగా అనిపించింది. ఇక పొడవాటి జడతో నాని లుక్ పూర్తి భిన్నంగా ఉంది. శ్రీకాంత్ ఓదెల సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేయడం ఖాయమని ప్రోమో చూశాక టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. ది పారడైజ్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
అయితే ది పారడైజ్(The Paradise) చిత్ర యూనిట్ ని వరుస లీక్స్ ఇబ్బంది పెడుతున్నాయి. ఆ చిత్రం లోకి కీలక విషయాలు బయటకు రావడం పరిపాటిగా మారింది. ఇటీవల గోడల మీద నటుడు మోహన్ బాబు స్కెచ్ వేసిన ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. దానితో మోహన్ బాబు ది పారడైజ్ చిత్రంలో విలన్ రోల్ చేస్తున్నాడంటూ ఊహాగానాలు చెక్కర్లు కొట్టాయి. తనను జైల్లో పెట్టించిన మోహన్ బాబు బొమ్మను హీరో గోడపై గీసుకొని పగతో రగిలిపోతాడు. ఇది రివేంజ్ డ్రామా అంటూ కథలు కూడా అల్లేశారు.
లీక్స్ ప్రతి సినిమాకు కామనే. ఇలాంటి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలకు కూడా లీక్స్ బాధ తప్పలేదు. అయితే ది పారడైజ్ విషయంలో అది పదే పదే రిపీట్ అవుతుంది. ఇంత పెద్ద బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ది పారడైజ్ లీకుల విషయంలో నాని, శ్రీకాంత్ ఓదెల జాగ్రత్తలు తీసుకోవడం లేదా? అనే సందేహాలు మొదలవుతున్నాయి. ఆ మధ్య మా సినిమా సమాచారం బయటపెడుతోంది, మాకు తెలిసిన దగ్గరి వాడే అంటూ శ్రీకాంత్ ఓదెల హింట్ ఇచ్చాడు. ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాక కూడా లీకులు ఆగడం లేదు.
విడులకు ముందే సినిమాకు సంబంధించిన సమాచారం బయటకు వస్తే అది ఫలితాన్ని దెబ్బ తీయవచ్చు. అందుకే కథతో పాటు కీలక ట్విస్ట్స్ ని బయట పెట్టరు. ఇక సోషల్ మీడియా యుగంలో గోప్యత అత్యంత సమస్యగా మారింది. ఒక ఫోటో లేదా వీడియో పోస్ట్ చేస్తే అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరికీ చేరిపోతుంది. ఏదిఏమైనా ఇకపై ది పారడైజ్ సమాచారం లీక్ కాకుండా నాని, శ్రీకాంత్ ఓదెల తగు చర్యలు తీసుకుంటే బెటర్. ది పారడైజ్ 2026 సమ్మర్ కానుకగా విడుదల కానుంది.