Gold Price Today: మొన్నటి వరకు బంగారం ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ మళ్లీ ఇప్పుడు బంగారం ధరలు పెరుగుతున్నాయి. గతంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగిన సమయంలో బంగారం అమాంతం పెరిగింది. అయితే యుద్ధానికి బ్రేక్ పడడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. కానీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ డ్రంప్ సుంకాలపై కీలక ప్రకటన చేయడంతో మరోసారి బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. జూలై 12న న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,750గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.99,900గా ఉంది. జూలై 11న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.90,200తో విక్రయించారు. 10 గ్రాముల బంగారం ధర శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.550 పెరిగింది. అటు 24 క్యారెట్ల బంగారం పై రూ.600 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Also Read: ఆ విషయంలో ప్రభాస్ అంత ఎమోషనల్ అయ్యాడు ఏంటి..? వైరల్ వీడియో…
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90,910 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.99,160గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.90,750 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.99,100 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.90,750 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.99,100తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.90,750తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.99,900తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. శనివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.1,21,000గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం రూ.100 పెరిగింది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.1,11,000గా ఉంది. ముంబైలో రూ.1,11,000, చెన్నైలో రూ.1,20,000 బెంగుళూరులో 1,11,000, హైదరాబాద్ లో రూ. 1,21,000 తో విక్రయిస్తున్నారు.
Also Read : రామ్ చరణ్ ని చూసి వెనక్కి తగ్గేది లేదంటున్న నాని..టాలీవుడ్ లో మరో సంచలనం!
తెలుగు రాష్ట్రాల్లో ఆషాఢమాసం సందర్భంగా బంగారం కొనుగోళ్లు తగ్గాయి. అయితే కొందరు ఇదే సమయంలో బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. కానీ బంగారం ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్వెస్టర్లు మాత్రం తమకు లాభం తెచ్చుకుంటున్నారు. అయితే ఈ బంగారం ధరలు ఇలాగే కొనసాగుతాయా? లేదా? అనేది చూడాలి.