Bare Sensations cruise: అమరావతి విషయంలో చంద్రబాబుకు పవన్ గట్టి షాక్విలువలు లేవు. వలువలూ లేవు. అంతా ఓపెన్ గానే. ఏమైనా చేసుకోండి. ఎంతైనా చేసుకోండి. అడిగేవాళ్లు లేరు. ఆపేవాళ్ళూ లేరు. తాగండి. తినండి. తూలండి. స్వర్గపు అంచులను తనివి తీరా తాకండి.. ఇష్టానుసారంగా ప్రవర్తించండి.. ఎల్లలు దాటి.. విశృంఖలమైన జీవితాన్ని ఆస్వాదించండి.. ఇదీ మియామీకి చెందిన ఓ క్రూయిజ్ అధికారికంగా చేసిన ప్రకటన. చదువుతుంటే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. ఇదేంటి ఇలా కూడా ఉంటుందా అనిపించినప్పటికీ.. అది అక్కడ వాళ్లకు ఒక సరదా.. సరదా మాత్రమే కాదు, ఒంటి దురద కూడా.
పాశ్చాత్య దేశాలకు చెందినవారు అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన పనులు చేస్తుంటారు. ఆ పనులు వారికి ఆనందాన్ని కలిగిస్తాయేమోగాని.. మిగతా వారిని మాత్రం ఇబ్బంది పెడతాయి. అలాంటిదే ఇది కూడా..మియామీ ప్రాంతానికి చెందిన బేర్ సెనేసిటీస్ అనే సంస్థ అక్కడ క్రూయిజ్ లను నడుపుతుంది.. అయితే కమర్షియల్ క్రూయిజ్ లు కాకుండా.. ఒక విభిన్నమైనమైన దానిని కూడా ఆ సంస్థ నడుపుతుంది.. వాస్తవానికి అది మామూలు క్రూయిజ్ మాదిరిగా ఉండదు. అందులో అన్ని డిఫరెంట్. తినే తిండి విభిన్నంగా ఉంటుంది. అక్కడ అందించే సేవలలో వైవిధ్యం కనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అదంతా కూడా ఆదిమానవుల యుగంలాగా దర్శనమిస్తుంది. ఫూల్ సైడ్ పార్టీలు జోరుగా సాగుతాయి. మద్య ప్రవాహం అంతకుమించి అన్నట్టుగా ఉంటుంది. ఇక తినే తిండి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎన్ని రకాల వంటకాలు ఉంటాయో.. అన్ని రకాలు అక్కడ అందుబాటులో ఉంటాయి. కాకపోతే ఇందులో ప్రయాణించడానికి కేవలం పెద్దలకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రయాణించే వారికి ఒంటిమీద నూలుపోగు కూడా ఉండకూడదు. వారి ప్రయాణం జరిగిన రోజుల మొత్తం అలానే ఉండాలి. ఏమాత్రం సిగ్గుపడకూడదు. ఇబ్బంది పడకూడదు..పైగా నచ్చినట్టు అందులో ఉండొచ్చు. మెచ్చినట్టు అందులో ప్రయాణించవచ్చు.. దీనికోసం ఎంత చెల్లించాలి.. ఏ రూపంలో చెల్లించాలి అనే విషయాలను బేర్ సెనేసిటీస్ సంస్థ వెల్లడించలేదు.
Also Read: మేకప్ లేకుండా బిగ్ బాస్ అశ్వినిని చూశారా?
అంతర్జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ సంస్థ క్రూయిజ్ ప్రారంభానికి ముందే టికెట్లు విక్రయిస్తుందని సమాచారం. ఒక్కో టికెట్ ధర దాదాపు 10 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇందులో కేటగిరీల వారీగా టికెట్ల ధరలు ఉన్నాయని సమాచారం. అయితే ఈ ప్రయాణాన్ని ఆస్వాదించడానికి.. స్వర్గలోకపు దారులలో విహరించడానికి యువత నుంచి మొదలు పెడితే మధ్య వయసు ఉన్న వారి వరకు ఉత్సాహాన్ని చూపిస్తుంటారని సమాచారం. అందువల్లే ఈ క్రూయిజ్ కు అంత డిమాండ్ ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా యువత ఈ ప్రయాణాన్ని చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారట. అందులో ప్రయాణించినన్నీ రోజులు ప్రపంచంతో సంబంధం లేకుండా సాగిపోతారట. భారీగా టికెట్ ధర ఉన్నప్పటికీ అందులో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు అంటే.. అందులో ఏ స్థాయిలో స్వేచ్ఛ, సౌకర్యాలు, అపరిమితమైన ఆనందాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
“ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రయాణించాలి. ఆ ప్రయాణం ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగాలి. ముఖ్యంగా అడ్డుతెరలు లేకుండా అదంతా జరిగిపోవాలి. అందువల్లే మేము ఈ ప్రయత్నం చేసాం. కాకపోతే ఇది ఊహించిన దానికంటే ఎక్కువ విజయవంతమైంది. అందువల్లే ఈ సర్వీస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. వచ్చే టూరిస్టుల కోసం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తున్నామని” నిర్వాహకులు చెబుతున్నారు.