spot_img
Homeఎంటర్టైన్మెంట్Unstoppable Season 3: అన్ స్టాపబుల్ 3: బాలయ్య గెస్ట్స్ గా సూపర్ స్టార్ అండ్...

Unstoppable Season 3: అన్ స్టాపబుల్ 3: బాలయ్య గెస్ట్స్ గా సూపర్ స్టార్ అండ్ డైనమిక్ సీఎం, దేత్తడి పోచమ్మ గుడే!

Unstoppable Season 3: బాలకృష్ణ డైలాగ్ చెబితే ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబొడుస్తాయి. మాస్ హీరోగా బాలకృష్ణను నిలబెట్టిన అంశాల్లో ఆయన డైలాగ్ డెలివరీ ఒకటి. అయితే ఆఫ్ స్క్రీన్ లో బాలకృష్ణ తడబడతాడు. ఆయన మంచి వ్యాఖ్యాత కాదు. పదాలు వెతుక్కుంటూ మాట్లాడతారు. బాలయ్య స్పీచ్ పలుమార్లు ట్రోల్స్ కి గురైంది. ఈ క్రమంలో బాలకృష్ణ హోస్ట్ గా టాక్ షో అనగానే అందరూ నవ్వుకున్నారు. అన్ స్టాపబుల్ అట్టర్ ప్లాప్ కావడం ఖాయమని డిసైడ్ అయ్యారు.

కానీ బాలయ్య అందరి అంచనాలు తలకిందులు చేశాడు. బాలయ్య హోస్టింగ్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహాలో ప్రసారమైన అన్ స్టాపబుల్ సీజన్ వన్ గ్రాండ్ సక్సెస్. ఆయన గెస్ట్స్ ని ట్రీట్ చేసిన తీరు మెప్పించింది. అలాగే అన్ స్టాపబుల్ షోని ఇతర టాక్ షోలకు భిన్నంగా డిజైన్ చేశారు. గెస్ట్స్ లైఫ్ లో ఉన్న కాంట్రవర్సీలను బాలకృష్ణ తెరపైకి తెచ్చేవాడు. టాక్ షో ఆద్యంతం షోని సక్సెస్ చేయడంలో బాలకృష్ణ సక్సెస్ అయ్యాడు.

అన్ స్టాపబుల్ షోలో టాప్ స్టార్స్ పాల్గొనడం మరొక విశేషం. మీడియా ముందుకు రావడానికి పెద్దగా ఇష్టపడని ప్రభాస్ అన్ స్టాపబుల్ షోకి వచ్చాడు. బాలకృష్ణ-ప్రభాస్ ఎపిసోడ్ చూసేందుకు ఆడియన్స్ పోటెత్తారు. దెబ్బకు ఆహా యాప్ సర్వర్లు క్రాష్ అయ్యాయి. ప్రభాస్ ఎఫైర్ రూమర్స్, పెళ్లి మేటర్ వంటి సెన్సిటివ్ క్వచ్చన్స్ బాలకృష్ణ అడిగాడు. ప్రభాస్ తనదైన శైలిలో సమాధానాలు చెప్పి తప్పించుకున్నాడు. అలాగే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ అతిథులుగా అన్ స్టాపబుల్ షోకి హాజరయ్యారు.

బావ చంద్రబాబు నాయుడును బాలకృష్ణ ఇంటర్వ్యూ చేయడం విశేషం. చంద్రబాబు నాయుడు రాజకీయ చరిత్రలో మచ్చగా ఉన్న ఆగస్టు సంక్షోభం వీరి మధ్య చర్చకు వచ్చింది. ఎన్టీఆర్ ని అధికారం నుండి తప్పించడానికి గల కారణాలు చంద్రబాబు ఓపెన్ గా మాట్లాడాడు. గతంలో చంద్రబాబు ఎన్నడూ ఈ విషయం పై స్పందించింది లేదు. ఇలాంటి ప్రత్యేకతల కారణంగా అన్ స్టాపబుల్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

రెండు సీజన్స్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ షో సీజన్ 3కి సిద్ధం అవుతుంది. దసరా కానుకగా అన్ స్టాపబుల్ సీజన్ 3 ప్రారంభం కానుందట. సీజన్ 3కి గెస్ట్స్ లిస్ట్ మైండ్ బ్లాక్ చేసేలా ఉంది. తెలంగాణాలో వైభవం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన డైనమిక్ లీడర్ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారట. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం పాల్గొనే అవకాశం కలదట. బాలకృష్ణ అల్లుళ్ళు, కూతుళ్లు సైతం హాజరయ్యే అవకాశం కలదట. ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Related News

Most Popular

Super El Nino

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
AP Rain Alert

AP Rain Alert: ఏపీలో మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు హెచ్చరిక!

AP Rain Alert: దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. వర్షపాతం లోటు కనిపిస్తోంది. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. ఇటువంటి తరుణంలో మళ్లీ వాతావరణం...
Polavaram Project

Polavaram Project: ‘పోలవరం’ ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబా..మజాకా!

Polavaram Project: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతోంది. ప్రజల్లో కొంత సంతృప్తి కనిపిస్తోంది. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు భారీగా రాష్ట్రానికి పెట్టుబడులు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి...
Sonam Wangchuk

Sonam Wangchuk: సోనమ్ వాంగ్ చుక్ కు సల్మాన్ ఇంటి భోజనం..

Sonam Wangchuk: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ మొత్తానికి తన దీక్ష విరమించారు.. నీట్ అక్రమాలపై విచారణ జరిపించాలని.. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని.. నీట్...
Oktelugu Epaper