spot_img
Homeఎంటర్టైన్మెంట్Cinema Viral : వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ !

Cinema Viral : వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ !

Cinema Viral : టాలీవుడ్ ట్రెండ్స్ నుంచి ప్రజెంట్ క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని ఉందని జబర్దస్త్ జడ్జి రోజా చెప్పారు. హోమ్ టూర్ పేరుతో ఇటీవల రోజా ఇంట్లో హైపర్ ఆది టీమ్ స్కిట్ చేసింది. అక్కడ హాల్‌లో బాలాజి విగ్రహం ఉంది. ఆయన్ని ఏం కోరుకుంటారమ్మా అని ఆది అడిగితే.. ‘కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుతో సినిమా చేయాలని ఉంది’ అని రోజా తెలిపారు. ‘కృష్ణా రామా అని ఇంట్లో కూర్చోవాల్సిన వయసులో మనకెందుకమ్మా ఈ మహేష్ బాబు సినిమాలు’ అంటూ ఆది సెటైర్ వేశాడు.

 

Roja
Roja

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ప్రముఖ అథ్లెట్, మహాభారతం సీరియల్ నటుడు ప్రవీణ్ కుమార్ సోబ్తి(74) కన్నుమూశారు. గుండెపోటుతో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మహాభారతంలో భీముడి పాత్ర పోషించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ప్రవీణ్.. క్రీడల్లోనూ రాణించారు. ఏషియన్ గేమ్స్‌లో 4 పతకాలు సాధించారు. 1968, 1972 ఒలింపిక్స్ గేమ్స్‌లో భారత్ తరపున ప్రాతినిథ్యం వహించారు. ప్రతిష్టాత్మక అర్జున అవార్డు గెలుచుకున్నారు. పలు సినిమాల్లో నటించారు.

Also Read: ఈ వారం అలరించబోతున్న చిత్రాలివే !

Praveen Kumar Sobti
Praveen Kumar Sobti

ఇక మరో అప్ డేట్ విషయానికి వస్తే.. ప్రేమికుల రోజున రాధేశ్యామ్ టీం సర్‌ప్రైజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేసింది. మార్చి 11న రాధేశ్యామ్ మూవీ విడుదలకు సిద్ధమవుతుండగా.. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుపుకున్న ఈ మూవీ మళ్లీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది. నైట్ థీమ్ పార్టీ పేరుతో కొత్త రకంగా ప్రమోట్ చేయనున్నారు.

Radhe Shyam
Radhe Shyam

ఇందుకోసం హైదరాబాద్‌లోని కెమిస్ట్రీ క్లబ్‌లో ప్రత్యేకంగా సెట్ వేయనున్నారు. ఈ నైట్ థీమ్ పార్టీకి చిత్ర యూనిట్ హాజరుకానుంది. మొత్తానికి ప్రేమికుల రోజున రాధేశ్యామ్ సర్‌ప్రైజ్ ఈవెంట్ జరగబోతుంది.

Also Read:  ల‌వ్ జిహాదీల‌కు ప‌దేళ్ల శిక్షః యూపీలో బీజేపీ ఎన్నిక‌ల మేనిఫెస్టో విడుద‌ల

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version