https://oktelugu.com/

Rakesh Master Passed Away: ప్రాణం పొయ్యేముందు రాకేష్ మాస్టర్ ఎంతలా విలవిలలాడి పోయాడో మీరే చూడండి..గుండెల్ని పిండేస్తున్న వీడియో!

వీడియోని చూసిన ప్రతీ ఒక్కరు రాకేష్ మాస్టర్ పడుతున్న బాధని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నీటిలో నుండి బయటపడ్డ చేప పిల్ల, కొనఊపిరి తో ఎలా కొట్టుమిట్టాడుతుందో, రాకేష్ మాస్టర్ కూడా అలా కనిపించడం చూసేందుకు చాలా బాధగా అనిపించింది. గాంధి హాస్పిటల్ లో ఆయనకీ ఆక్సిజన్ పెట్టినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లోనే కనిపించాడు.

Written By: , Updated On : June 19, 2023 / 10:06 AM IST
Rakesh Master Passed Away

Rakesh Master Passed Away

Follow us on

Rakesh Master Passed Away: ఎల్లప్పుడూ చలాకీగా ఉంటూ, సోషల్ మీడియా మీమ్స్ ద్వారా ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యే రాకేష్ మాస్టర్, అకస్మాత్తుగా చనిపోయాడు అనే వార్త విని ఒక్కసారిగా అందరూ షాక్ కి గురి అయ్యారు. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా సెలెబ్రిటీలతో ఉత్తరాంధ్ర లో వీడియోలు చేస్తూ కనిపించాడు, ఇంతలోపే ఇలా ఎలా అయ్యింది అంటూ నెటిజెన్స్ ఆరాలు తీస్తున్నారు. తమకి తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ఇచ్చే రాకేష్ మాస్టర్ ఇక నుండి లేదు అనే వార్తనే జీర్ణించుకోలేక పోతున్నారు నెటిజెన్స్.

తే కాదు పెద్దగా సంపాదన లేని రాకేష్ మాస్టర్, తనకి వచ్చిన దాంట్లో కూడా నలుగురికి సహాయం చెయ్యాలనే గొప్ప మనసు ఉన్న వ్యక్తి ఆయన. సహాయం చేసాడు కూడా, అలా రాకేష్ మాస్టర్ ఎమోషనల్ గా కూడా ఫ్యాన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాడు. ఇది ఇలా ఉండగా రాకేష్ మాస్టర్ కి సంబంధించిన చివరి వీడియో ఒకటి నిన్నటి నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

ఈ వీడియోని చూసిన ప్రతీ ఒక్కరు రాకేష్ మాస్టర్ పడుతున్న బాధని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నీటిలో నుండి బయటపడ్డ చేప పిల్ల, కొనఊపిరి తో ఎలా కొట్టుమిట్టాడుతుందో, రాకేష్ మాస్టర్ కూడా అలా కనిపించడం చూసేందుకు చాలా బాధగా అనిపించింది. గాంధి హాస్పిటల్ లో ఆయనకీ ఆక్సిజన్ పెట్టినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి లోనే కనిపించాడు.

ఇండస్ట్రీ లో మహేష్ బాబు , రవితేజ , నాగార్జున , ప్రభాస్ ఇలా ఎంతో మందికి కొరియోగ్రఫీ చేసిన వ్యక్తి, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్స్ ని అందించిన గొప్ప గురువుని ఇలా చూడడం అభిమానులకు జీర్ణించుకోలేని విధంగా మారింది. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ పోస్టులు పెడుతున్నారు. ఆ వీడియో ని ఒక్కసారి మీరు కూడా చూడండి.