https://oktelugu.com/

Rakesh Master Passed Away: జగన్ అన్న ‘భూమ్ భూమ్’ బీర్ రాకేష్ మాస్టర్ ప్రాణం తీసిందా..?

చాలా కాలం సినిమాల్లో అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడట, అలాంటి సమయం లో ఆయనని ఈ సోషల్ మీడియానే ఆడుకుంది అని చెప్పొచ్చు. ఇక రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం చెయ్యడం కోసం,

Written By:
  • Vicky
  • , Updated On : June 19, 2023 / 09:28 AM IST

    Rakesh Master Passed Away

    Follow us on

    Rakesh Master Passed Away: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణ వార్త యావత్తు సినీ లోకాన్ని షాక్ కి గురి చేసి శోకసంద్రం లోకి నెట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన సినీ పరిశ్రమ కంటే కూడా ఎక్కువగా నెటిజెన్స్ కి పరిచయం. తన ఇంటర్వ్యూస్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న రాకేష్ మాస్టర్, ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసి, ఎన్నో వందల వీడియోస్ చేసాడు.

    ఆ వీడియోస్ ద్వారా వస్తున్న డబ్బులతోనే రాకేష్ మాస్టర్ జీవితం
    గడుపుతున్నాడు.ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి శేఖర్ మాస్టర్ మరియు జానీ మాస్టర్ లాంటి మోస్ట్ టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ ని అందించిన రాకేష్ మాస్టర్, ఇలా ఇండస్ట్రీ లో అవకాశాలు లేక యూట్యూబ్ వీడియోస్ చేసుకునే స్థాయికి పడిపోతాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇండస్ట్రీ లో ఉన్న కొంతమంది సీనియర్ డ్యాన్స్ మాస్టర్స్ వల్లే తన జీవితం ఇలా అయ్యింది అని అనేక ఇంటర్వ్యూస్ లో చెప్పాడు రాకేష్ మాస్టర్.

    చాలా కాలం సినిమాల్లో అవకాశాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడట, అలాంటి సమయం లో ఆయనని ఈ సోషల్ మీడియానే ఆడుకుంది అని చెప్పొచ్చు. ఇక రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం చెయ్యడం కోసం, సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉండే కొంతమంది సెలబ్రిటీస్ ని తీసుకొని ఉత్తరాంధ్ర కి వెళ్ళాడు. ‘అగ్గిపెట్టె మచ్చ’, సునిసిత్, స్వాతి నాయుడు ఇంకా కొంతమంది ముఖ్యమైన సెలబ్రిటీస్ తో ఆయన ఈ ప్రోగ్రాం చేసాడు. ఆ వీడియోలు సోషల్ మీడియా లో ఇప్పటికీ ట్రెండింగ్ అవుతున్నాయి. ఆయన నుండి మరో వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఆయన మరణ వార్త కోలుకోలేని షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.

    అయితే రాకేష్ మాస్టర్ ఉత్తరాంధ్ర టూర్ లో మితిమీరి తాగడం వల్లే ఇలా అయ్యింది అని అంటున్నారు. చనిపోయే ముందు రోజు రాత్రి 30 ‘భూమ్ భూమ్’ బీర్లు తాగాడని, ఆ తర్వాత ఆయనకీ బ్లడ్ వాంటింగ్స్ మరియు విరోచనాలు అవ్వడం తో వెంటనే గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లామని, అక్కడ రాకేష్ మాస్టర్ పరిస్థితిని గమనించిన డాక్టర్లు ఇక ఆయన బ్రతకడం కష్టమే అని చెప్పరంటూ రాకేష్ మాస్టర్ సన్నిహితులు చెప్తున్నారు.