Chiranjeevi Success: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చొబెట్టాయి. ఇప్పటివరకు ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక మీదట ఆయన చెబుతున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లారిటిని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక అలాంటి చిరంజీవి ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు. 70 సంవత్సరాల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీని ఇస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. అయితే చిరంజీవి రామ్ చరణ్ ను స్టార్ హీరోగా నిలబెట్టడంలో సక్సెస్ ని సాధించాడు. తను ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు తనను ఆదరిస్తారు.
మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవాలంటే ఏం చేయాలి అనే విధంగా ఆలోచనలు చేసిన చిరంజీవి మొత్తానికైతే రామ్ చరణ్ ని ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా నిలబెట్టాడనే చెప్పాలి. నాగార్జున విషయంలో మాత్రం ఇది సాధ్యపడలేదు. తన ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీకి వచ్చినప్పటికి వాళ్ళిద్దరు కూడా టైర్ వన్ హీరోల లిస్ట్ లో పేరు సంపాదించుకోలేదు.
నాగచైతన్య కొంతవరకు బెటర్ గా అనిపించినప్పటికి అఖిల్ మాత్రం ఈ విషయంలో చాలా వరకు వెనుకబడిపోయాడు… ఒక్క సక్సెస్ ను కూడా సాధించలేకపోతున్నాడు. తనదైన రీతిలో ఆయన సత్తా చాటుకోవాలి అంటే మాత్రం చాలా వరకు కసరత్తులు చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక వీళ్లిద్దరితో పోలిస్తే బాలయ్య బాబు మరి దారుణంగా తయారయ్యాడు. తన కొడుకుని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఆయన చాలా సంవత్సరాల సమయాన్ని తీసుకుంటున్నాడు.
ఇప్పటికి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఉంటుంది అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నారు. మొత్తానికైతే మెగాస్టార్ చిరంజీవి తను 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఎనలేని సేవలను అందిస్తూనే తన కొడుకుని కూడా స్టార్ హీరోని చేయడంలో తను సక్సెస్ ని సాధించాడనే చెప్పాలి…