Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi shock over Toxic movie: మెగాస్టార్ చిరంజీవి కి కోలుకోలేని షాక్ ఇచ్చిన 'టాక్సిక్'...

Chiranjeevi shock over Toxic movie: మెగాస్టార్ చిరంజీవి కి కోలుకోలేని షాక్ ఇచ్చిన ‘టాక్సిక్’ మూవీ టీం.. ఇది అసలు ఊహించలేదు..

Chiranjeevi shock over Toxic movie: భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన కన్నడ సూపర్ స్టార్ యాష్ ‘టాక్సిక్’ చిత్రం విడుదల విషయం లో ఎంత జాప్యం జరుగుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ముందుగా ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని మార్చి 19 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ అది జరగలేదు. అనేక సన్నివేశాలు రీ షూటింగ్ చేయాల్సిన అవసరం ఉండడం తో , ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్టు వార్తలు […]

Chiranjeevi shock over Toxic movie: భారీ బడ్జెట్ , భారీ తారాగణంతో తెరకెక్కిన కన్నడ సూపర్ స్టార్ యాష్ ‘టాక్సిక్’ చిత్రం విడుదల విషయం లో ఎంత జాప్యం జరుగుతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ముందుగా ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని మార్చి 19 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ అది జరగలేదు. అనేక సన్నివేశాలు రీ షూటింగ్ చేయాల్సిన అవసరం ఉండడం తో , ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్టు వార్తలు వినిపించాయి. జూన్ నెలలో ఎట్టకేలకు విడుదల చేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ ఈ నెలలో కూడా ఈ చిత్రం రావడం లేదు. దీంతో అందరూ ఈ చిత్రం క్రిస్మస్ కానుక విడుదల చేస్తారేమో అని అనుకున్నారు. అందుకు హీరో యాష్ అసలు ఒప్పుకోవడం లేదట. సంక్రాంతికి విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట యాష్.

ఇప్పటికే ఈ సినిమాపై చాలా ఖర్చు చేసాము , విడుదల వాయిదా పడుతూ రావడం వల్ల మనం చాలానే నష్టపోవాల్సి వచ్చింది. ఈ నష్టాలు పూడవాలంటే , కచ్చితంగా ఈ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చెయ్యాలి, లేదంటే కష్టం అని మేకర్స్ తో యాష్ చెప్పినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ తో పాటు, హీరో యాష్ కూడా సహనిర్మాతగా వ్యవహరించాడు. అందుకే ఆయన నష్టపోకూడదు అనే ఉద్దేశ్యం తోనే ఈ సినిమాని సంక్రాంతి విడుదల చెయ్యాలని పట్టుబడుతున్నారు. మరో రెండు రోజుల్లో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదంతా పక్కన పెడితే సంక్రాంతికి ఈ సినిమా ఒకవేళ విడుదలైతే , మన తెలుగు సినిమాలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇదే సంక్రాంతికి చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్యాంగ్ స్టర్ డ్రామా విడుదల కాబోతుంది.

రీసెంట్ గానే పొలాచ్చి లో 12 రోజుల మొదటి షెడ్యూల్ ని విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చింది మూవీ టీం. మొత్తం పని దినాలు 102 రోజులు మాత్రమే అట. అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే , సెప్టెంబర్ లోపు ఈ సినిమా పూర్తి అయిపోవచ్చు. అందుకే సంక్రాంతికి విడుదల చెయ్యాలని చూస్తున్నారు మేకర్స్. ఈ సినిమాని కూడా KVN ప్రొడక్షన్స్ సంస్థ నే నిర్మిస్తోంది. ఇకపోతే టాక్సిక్ చిత్రం తెలుగు వెర్షన్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసాడు. ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటే , దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని టాప్ థియేటర్స్ అన్నిటిని బ్లాక్ చేసుకుంటాడు , చిరంజీవి సినిమాతో పాటు, ఇతర హీరోల సినిమాలు కూడా ఒక డబ్బింగ్ చిత్రం కారణంగా నష్టపోవాల్సి ఉంటుంది, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper