Homeఎంటర్టైన్మెంట్Srikanth Odela: శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీ చిరంజీవి తో చేయడం లేదా...ఆ స్టార్ హీరోని...

Srikanth Odela: శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీ చిరంజీవి తో చేయడం లేదా…ఆ స్టార్ హీరోని లైన్ లో పెట్టాడా…

Srikanth Odela: దసరా సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానిని హీరోగా పెట్టి ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే అతనికి చిరంజీవితో ఒక సినిమా ఓకే అయింది. చిరంజీవి సైతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాను అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. ప్యారడైజ్ సినిమా రిలీజ్ ను బట్టి ఆ సినిమా సక్సెస్ ని బట్టి చిరంజీవి తనతో సినిమా […]

Srikanth Odela: దసరా సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానిని హీరోగా పెట్టి ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే అతనికి చిరంజీవితో ఒక సినిమా ఓకే అయింది. చిరంజీవి సైతం శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాను అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశాడు. ప్యారడైజ్ సినిమా రిలీజ్ ను బట్టి ఆ సినిమా సక్సెస్ ని బట్టి చిరంజీవి తనతో సినిమా చేస్తాడా లేదా అనే విషయంలో ఒక క్లారిటీ వస్తుందంటూ చాలామంది అభిప్రాయపడుతున్నారు. నిజానికైతే చిరంజీవితో సినిమా చేయకపోయినా కూడా శ్రీకాంత్ ఓదెల ఆల్టర్నేట్ మరో ప్లాన్ అయితే వేసుకొని కూర్చున్నారట.

ఇప్పటికే తను విజయ్ దేవరకొండ కి ఒక కథ చెప్పి ఒప్పించాడు. చిరంజీవి నుంచి అవకాశం వస్తే ఆయనతో సినిమా చేస్తాడు. ఆ సినిమా ప్లాప్ అయితే విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తాడు. ఇక ఏదేమైనా కూడా శ్రీకాంత్ ఓదెల ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది పకడ్బందీ ప్రణాళికలతో రూపొందించుకొని ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయామనే చెప్పాలి…

మొత్తానికైతే ప్యారడైజ్ సినిమాని చాలా వేగంగా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ సినిమా మీద అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగా పెడుతున్నారు. దానివల్ల సినిమా మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా కనక జరిగితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాని తొందరగా ఫినిష్ చేయాలని చూస్తున్నారు.

వాళ్ళు అనుకున్నట్టుగా సినిమాని తీయగలుగుతున్నారా లేదంటే తొందర తొందరగా చుట్టేస్తున్నారా అనే నేపథ్యంలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాని వీలైనంత తొందరగా రిలీజ్ చేసి శ్రీకాంత్ ఓదెల మరో సినిమా మీద తన పూర్తి ఫోకస్ పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి శ్రీకాంత్ ఓదెల నెక్స్ట్ మూవీ ఎవరితో ఉండబోతుందనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper