Homeఎంటర్టైన్మెంట్Arjun Blast OTT release: ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ లేటెస్ట్ సూపర్ హిట్...

Arjun Blast OTT release: ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘బ్లాస్ట్’.. ఎందులో చూడాలంటే..

Arjun Blast OTT release: ఈ మధ్య కాలం లో విడుదలైన కొన్ని సినిమాల్లో ప్రేక్షకులతో పాటు , ట్రేడ్ ని కూడా సర్ప్రైజ్ కి గురి చేసిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో సీనియర్ హీరో , యాక్షన్ కింగ్ అర్జున్ హీరో గా నటించిన ‘బ్లాస్ట్’ అనే చిత్రం కూడా ఉంది. అర్జున్ హీరోగా సూపర్ హిట్ ని అందుకొని చాలా ఏళ్ళు అయ్యింది. ఈమధ్య కాలం లో ఆయన హీరో పాత్రలకు గుడ్ […]

Arjun Blast OTT release: ఈ మధ్య కాలం లో విడుదలైన కొన్ని సినిమాల్లో ప్రేక్షకులతో పాటు , ట్రేడ్ ని కూడా సర్ప్రైజ్ కి గురి చేసిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో సీనియర్ హీరో , యాక్షన్ కింగ్ అర్జున్ హీరో గా నటించిన ‘బ్లాస్ట్’ అనే చిత్రం కూడా ఉంది. అర్జున్ హీరోగా సూపర్ హిట్ ని అందుకొని చాలా ఏళ్ళు అయ్యింది. ఈమధ్య కాలం లో ఆయన హీరో పాత్రలకు గుడ్ బై చెప్పి, క్యారెక్టర్ రోల్స్ కి , విలన్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యాడు. మళ్లీ అర్జున్ హీరో గా ఎంట్రీ ఇచ్చి , సూపర్ హిట్ కొడతాడని ప్రేక్షకులు మాత్రమే కాదు, అర్జున్ కూడా ఊహించి ఉండదు. అలాంటి అరుదైన ఘటనే ‘బ్లాస్ట్’ చిత్రానికి జరిగింది. ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్క ప్రకారం ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయట.

ప్రీతీ ముకుందన్ , అభిరామి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఫార్మ్ లో లేని సీనియర్ హీరో అర్జున్ చిత్రానికి ఏకంగా 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు , సినిమాలో ఎంతో గొప్ప కంటెంట్ ఉంటే తప్ప , ఈ రేంజ్ వసూళ్లు అసాధ్యం. దీంతో ఓటీటీ లవర్స్ ఏముంది ఈ సినిమాలో అంతగా?, కచ్చితంగా ఓటీటీ లో చూడాల్సిందే అని ఫిక్స్ అయ్యి , ఓటీటీ విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి ఇప్పుడు ఓకే గుడ్ న్యూస్. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ ప్రైజ్ కి కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం ఈ చిత్రాన్ని జూన్ 26 న విడుదల చెయ్యాలి.

అందుకే ఈ చిత్రాన్ని ఈ నెల 26 న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగు , తమిళం తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్స్ లో ఈ రేంజ్ బ్లాస్టింగ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం , ఓటీటీ ఆడియన్స్ ని ఏ రేంజ్ లో అలరించబోతుందో చూడాలి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే , రాజారామ్ అనే మిడిల్ క్లాస్ కి చెందిన కరాటీ మాస్టర్ సమాజం లో జరిగే అన్యాయాన్ని ఎదురుకునే క్రమంలో తన భార్య నీలవేణి , కూతురు నీల కు కరాటీ ట్రైనింగ్ ఇస్తూ పెంచుతాడు. అనుకోకుండా నీలా ఒక కార్పొరేట్ సిండికేట్ లో చిక్కుకుంటుంది. అక్కడి నుండి ఎలా బయటపడింది అనేది స్టోరీ. స్టోరీ మామూలుగానే ఉన్నప్పటికీ, స్క్రీన్ ప్లే , అందులో వచ్చే ట్విస్టులు వేరే లెవెల్ లో ఉంటాయి. అందుకే ఆడియన్స్ ఈ చిత్రానికి ఈ రేంజ్ లో కనెక్ట్ అయ్యారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper