Chiranjeevi And Ram Gopal Varma: మెగాస్టార్ చిరంజీవితో అవకాశం వస్తే సినిమాలు చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ ఎంటైర్ కెరియర్ లో చిరంజీవిని ఒక్కసారైనా సరే డైరెక్షన్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ శివ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న రామ్ గోపాల్ వర్మ మాత్రం చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే ఆ సినిమాని స్టార్ట్ చేసి మధ్యలోనే వదిలేసి ముంబై వెళ్ళిపోయాడు… బాలీవుడ్ నుంచి అతనికి భారీ ఆఫర్ రావడంతో చిరంజీవి సినిమాను పక్కన పెట్టేసాడు. దాంతో అప్పటినుంచి ఇప్పటివరకు చిరంజీవి ఆర్జీవి మీద చాలా కోపంతో ఉన్నాడు. ఇక అప్పటి నుంచి ఆర్జీవి సైతం చిరంజీవి మీద అవకాశం దొరికిన ప్రతిసారి నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నాడు.
Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి
ఇక ఇలాంటి క్రమంలోనే ఆర్జీవి ప్రస్తుతం ఆ సినిమాను మళ్లీ తెరకెక్కించాలని చూస్తున్నాడు.
చిరంజీవితో మాత్రం కాదు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఒక్క యంగ్ హీరోతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకున్న శర్వానంద్ తో ఈ సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. ఇక ఇంతకుముందే వీళ్ళ కాంబినేషన్లో ‘సత్య 2’ సినిమా వచ్చింది. కానీ ఆ మూవీ ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరి కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీ కథ మాత్రం చాలా కొత్తగా ఉందట.
అప్పుడే చాలా ఫ్రెష్ కథను తీసుకున్న వర్మ ఇప్పుడు దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి మరింత గ్రిప్పింగ్ గా మార్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా శర్వానంద్ ఈ సినిమాలో నటిస్తే మాత్రం బాగుంటుందని కొంతమంది చెప్తుంటే మరి కొంతమంది మాత్రం వర్మతో సినిమా చేయడం అంటే వాళ్ళు తమ కెరియర్ ని పోగొట్టుకోవడమే అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…