‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై శ్రవణ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు వసుమతి యోగం ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి అనుకూలంగా మారనుంది. మరి కొన్ని రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు కొత్తగా పెట్టుబడులు పెడతారు. వీరికి పెద్దల ఆశీస్సులు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బంధువుల నుంచి కీలక సమాచారాన్ని అందుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు ఈ రోజు శుభవార్తలు వింటారు. అకస్మాత్తుగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఏమైనా కొత్త సమస్యలు వస్తే ఆందోళన చెందకూడదు. సామరస్యంతో పరిష్కరించుకోవాలి. గత తప్పుల నుంచి బయటపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. ఉద్యోగులు సంయమనంతో పాటించాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనారోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండకూడదు. వ్యాపారులు కొత్త భాగస్వాములను ఎంచుకుంటారు. ఉద్యోగులకు తోటి వారి నుంచి మద్దతు ఉంటుంది. డబ్బులు విషయంలో ఎవరికీ వాగ్దానం ఇవ్వద్దు. కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు ఎదుర్కొంటారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారికి ఈ రోజు కొత్త అవకాశాలు లభిస్తాయి. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి సలహాతో వ్యాపారులు అభివృద్ధి సాధిస్తారు. వైద్యుల సూచన మేరకు నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల కొత్త అప్పులు చేయకుండా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు కొత్త ఆస్తి కొనాలని అనుకుంటే వారి కళ నెరవేరుతుంది. వ్యాపారంలో ఆకస్మాత్తుగా లాభం వస్తుంది. ఏదైనా కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తే పెద్దల సలహా తీసుకోవాలి. ఆర్థిక సంబంధించిన శుభవార్తలు వింటారు. గతంలో చేసిన తప్పుల నుంచి పొరపాటు నేర్చుకుంటారు. అపరిచితుడు నమ్మకుండా ఉండాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు బలోపేతం అవుతుంది. కొన్ని పనులను పూర్తిగా చేయడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతారు. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గర నైనా అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించడంలో కష్టమవుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారాలు కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే పెద్ద సలహా తీసుకోవడం మంచిది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో సమస్యలు ఎదుర్కొంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి. సొంత వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఈ రాశి వారు ఈ రోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు. అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో కెరీర్ గురించి చర్చిస్తారు. విహార యాత్రలకు వెళ్లాలని అనుకునేవారు ప్లాన్ చేస్తారు. విలువైన వస్తువులను కాపాడుకోవాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. బంధువుల నుంచి అప్పు తీసుకోవాల్సి వస్తే దానిని తిరిగి చెల్లించడం కష్టం కష్టమవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు స్నేహితులతో సమయం గడుపుతారు. ఏదైనా అనారోగ్యం వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కొత్త వాహనాలను కనుగోలు చేస్తారు. ఇలా అతి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : జీవిత భాగస్వామితో వాదనలు ఉంటాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాలి.