Kaka Teaser: మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం గతంలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో అందరికీ తెలిసిందే. వరుస ఫ్లాప్స్ లో ఉన్న మెగాస్టార్ ని సక్సెస్ ట్రాక్ మీదకు ఎక్కించిన సినిమా ఇది. అలాంటి సూపర్ హిట్ తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘కాకా’. నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. టీజర్ ని చూస్తున్నంత సేపు , ఈ చిత్రానికి డైరెక్టర్ నిజంగానే బాబీ నా అనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే బాబీ సినిమాలు ఊర నాటు మాస్ కమర్షియల్ పద్దితిలో ఉంటాయి. ఆ జానర్ లో ప్రస్తుతం అదరగొడుతున్న డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి తర్వాత బాబీ నే.
అలాంటి బాబీ నుండి ‘జైలర్’ ఫార్మటు మూవీ రాబోతోందా? అనే ఫీలింగ్ కలిగింది ఈ టీజర్ ని చూస్తున్నంతసేపు. ఇందులో చిరంజీవి ఒక సాధారణ వ్యాపార వేత్తగా చూపించాడు. ఒక ఫ్యాక్టరీ ని నడుపుతూ , చాలా సింపుల్ గా జీవించే హీరో గా ఇందులో మెగాస్టార్ ని చూపించాడు. అతనికి ఒక కూతురు ఉంటుంది , ఆ కూతురే తన పంచ ప్రాణాలు అనేది కూడా ఈ టీజర్ లో చూపించాడు. ఇక చివర్లో నీళ్లలో నుండి మారుణాయుధాలు తీసినప్పుడు , ఇతనికి బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది అనే విషయాన్ని చెప్పకనే చెప్పాడు డైరెక్టర్ బాబీ. ఓవరాల్ గా చిరంజీవి ని జైలర్ , విక్రమ్ తరహా మూవీ లో చూపించబోతున్నాడు బాబీ. ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా కుదిరితే ఈ సినిమాతో మెగాస్టార్ 400 కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతాడు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు.
ఇకపోతే ఈ టీజర్ లో థమన్ అందించిన నేపధ్య సంగీతం అదిరిపోయింది. ఆయన మార్క్ ని చూపించాడు. కానీ చిరంజీవి పాత సినిమా పాటని రీమిక్స్ చేయడం అవసరమా అని అనిపించింది. అయితే రీసెంట్ గా ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ ఈవెంట్ లో చిరంజీవి ఈ చిత్రం టైటిల్ ని లీక్ చేస్తూ ‘కదిరి’ అనే పదాన్ని వదులుతాడు. ఈ చిత్రం టైటిల్ ‘కదిరి కాకాజీ’ అని కూడా అందరూ చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు కేవలం ‘కాకా’ టైటిల్ ఫిక్స్ అయ్యింది. అంటే చిరంజీవి టైటిల్ ని లీక్ చేయడం వల్ల , చివరి నిమిషం లో టైటిల్ లో మార్పులు జరిగాయా అని అంటున్నారు నెటిజెన్స్. ఇక అభిమానులను విశేషం గా అలరించిన ‘కాకా’ టీజర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూసి ఎంజాయ్ చేయండి.
Presenting the WHOLE NEW SIDE of MEGASTAR @Kchirutweets Garu on his birthday
TITLE GLIMPSE OUT NOW
— https://t.co/QfdITiDYx6KAAKA will set THE BLOODY BENCHMARK on the BIG SCREENS this Sankranthi, on JANUARY 13, 2027 #HBDMegastarChiranjeevi pic.twitter.com/BG8rtgLHj3
— Kaaka (@KaakaMovie) August 22, 2026