Chiranjeevi And Aishwarya Rai: ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ బాబీ(Bobby Kolly) తో చేయబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల ఉగాది నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గత నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మొదలు అవ్వాలి. కానీ చిరంజీవి కి మోకాళ్ళ సర్జరీ జరగడం, అదే విధంగా రీసెంట్ గానే ఆయనకు భుజం సర్జరీ కూడా జరగడంతో షూటింగ్ ని వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల క్యాస్టింగ్ మొత్తాన్ని డైరెక్టర్ బాబీ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి కి జోడీ గా ఎవరు నటించబోతున్నారు అనే అంశం పై పెద్ద చర్చ నే నడిచింది. అనేక మంది అనేక పేర్లు ప్రచారం లోకి తెచ్చారు కానీ, చివరికి ఫైనల్ అయ్యింది మాత్రం ఐశ్వర్య రాయ్ బచ్చన్(Aishwarya Rai Bachan).
రీసెంట్ గానే డైరెక్టర్ బాబీ ఈమెని కలిసి, స్టోరీ ని వివరించి , డేట్స్ కూడా లాక్ చేసినట్టు తెలుస్తోంది. అందుకు ఐశ్వర్య రాయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, డేట్స్ ని కేటాయించడం జరిగిందట. రెమ్యూనరేషన్ వివరాల గురించి కూడా నిర్మాతతో చర్చించినట్టు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం, ఆమె సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం అక్షరాలా 12 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకోబోతుందట. ఇది మామూలు విషయం కాదు. చాలా మంది హీరోలు కూడా మన వద్ద ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ని అందుకోవడం లేదు. అయితే ఐశ్వర్య రాయి బచ్చన్ కి నార్త్ ఇండియా లో మంచి క్రేజ్ ఉంది, కేవలం ఆమెన్ చూసి థియేటర్స్ కి కదిలే ప్రేక్షకుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అందుకే ఆమెకు అంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు నిర్మాతలు.
ఇది కాసేపు పక్కన పెడితే ఈ చిత్రం లో నటిస్తున్న ఇతర నటీనటుల గురించి ఒక లుక్ వేస్తే, ఇందులో మలయాళం సూపర్ స్టార్, చిరంజీవి తో సరిసమానమైన స్టార్ స్టేటస్ ఉన్నటువంటి హీరో మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అదే విధంగా ఈ చిత్రం లో చిరంజీవి కి కూతురి పాత్రలో ‘ఛాంపియన్’ మూవీ హీరోయిన్ అనశ్వర రాజన్ నటించబోతుంది. రెండవ సినిమాతోనే ఆమె ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ కొట్టేయడం అనేది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా ఈ చిత్రంలో విలన్ గా అనురాగ్ కశ్యప్ నటించబోతున్నాడు. తమిళం, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సొంతం చేసుకున్న ఇతను ఈ సినిమాలో భాగం అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు.