War 2 Movie Ticket Price: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలను చేసి ఆ మూవీస్ ను జనాల్లోకి తీసుకెళ్లడానికి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ ను చేస్తుంటారు. ఇక దానికి తగ్గట్టుగానే సినిమా టికెట్లు రేట్ల పెంపు విషయంలో గానీ అదనపు షోస్ కి పర్మిషన్ ఇవ్వడానికి సినిమా యూనిట్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమానాలతో అయితే తీసుకుంటారు…మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ‘వార్ 2’ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఏపీ లో ఈ సినిమాకి టికెట్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి ప్రత్యేక మైన ధన్యవాదాలను తెలియజేశాడు…
Also Read: వార్ 2 సక్సెస్ అయితే ఎన్టీఆర్ ఆ ఫీట్ ను సాధిస్తాడా..?
ఇక డీజిల్ స్క్రీన్ మీద 75(జీఎస్టీ కలిపి), మల్టీ ఫ్లెక్స్ లో 100 (జీఎస్టీ కలిపి) ఇక గత కొద్ది రోజులుగా ఎన్టీఆర్ కి చంద్రబాబు నాయుడుకి మధ్య కొన్ని విభేదాలు అయితే వచ్చాయని, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఏ రకంగాను స్పందించలేదని చంద్రబాబు మీద కొంతవరకు కోపంతో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. కానీ వాటికి చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలియజేస్తూ ఈ టికెట్ల రేట్ పెంపును అనుమతినిచ్చినట్టుగా తెలుస్తోంది.
అలాగే వీళ్ళ మధ్య కమ్యూనికేషన్స్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి అంటూ ఇటు నందమూరి అభిమానులు, అటు టిడిపి కార్యకర్తలు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేయడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పిస్తాడు అంటూ ఎన్టీఆర్ అభిమానులు చాలా కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు.
Also Read: వార్ 2 సక్సెస్ అయితే ఎన్టీఆర్ ఆ ఫీట్ ను సాధిస్తాడా..?
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక నందమూరి అభిమానులు అందరు ఈ సినిమాను చూసి సక్సెస్ ఫుల్ గా నిలుపడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు… చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి విజయాన్ని సాధిస్తాడు అనేది…