Insurance Buyers: ఇప్పుడున్న కాలంలో మనిషి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాడో తెలియకుండా ఉంది. క్షణంలో ప్రాణాలు పోయే సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అయితే ప్రమాదం జరిగిన ఒక వ్యక్తి మరణిస్తే బాధగానే ఉంటుంది. కానీ ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబం మరింత ఆవేదన చెందుతుంది. ఎందుకంటే కుటుంబానికి బాధ్యతగా ఉన్న ఒక వ్యక్తి లేకపోయేసరికి ఆ కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని చాలా కంపెనీలు అవగాహన కల్పిస్తున్నాయి. అయితే ఈ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో ఒక చిన్న టిక్ చేయాలి. అది చేయకపోతే ఎంత పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ తీసుకున్న ఉపయోగం ఉండదు. మరి దాని గురించి తెలుసుకోవాలంటే ఈ వివరాల్లోకి వెళ్లాలి..
Also Read: తొలి శుభలేఖ మొదట ఆ దేవుడికి ఇవ్వాలి.. ఎందుకంటే..?
సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేవారు దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే తమ కుటుంబానికి ఆర్థిక సహాయం గా ఉండాలని అనుకుంటారు. ఇందుకోసం తమ ప్రీమియంను బట్టి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అయితే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ఒకవేళ దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ ఇన్సూరెన్స్ మొత్తం ఆ వ్యక్తి అప్పటికే అప్పులు చేసి ఉంటే వాటికే వెళుతుంది. దీంతో కుటుంబం అప్పటికి కూడా ఆవేదన చెందుతూనే ఉంటుంది.
హర్షద్ మెహతా అనే పారిశ్రామిక వేత్త గురించి అందరికీ తెలిసిన విషయమే. 1992లో హర్షద్ మెహతా స్కాం బయటపడింది. దీంతో కోర్టు తనకు సంబంధించిన ఆస్తులను, బంగారాన్ని మొత్తం జప్తు చేసుకుంది. అయితే అతనిపై ఉన్న ఇన్సూరెన్స్ కూడా తీసుకునే అవకాశం కూడా ఉంది. కానీ హర్షద్ మెహతా ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలోనే ఒక చిన్న పని చేశాడు. అతను ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలోనే Married Women Property Act అనే కాలంలో టిక్ చేశాడు. ఇలా టిక్ చేయడం వల్ల కోర్టు హర్షద్ మెహతా కు సంబంధించిన అన్ని ఆస్తులను జప్తు చేసుకుంది. కానీ తనకు సంబంధించిన రూ. 10 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ను కోర్టు జప్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అందుకు కారణం ఏమిటంటే ఈ ప్రాపర్టీ మొత్తం తన కుటుంబానికి మాత్రమే చెల్లుతుంది. దీనిని ఎవరూ తీసుకోవడానికి అవకాశం లేదు.
అయితే ఇన్సూరెన్స్ తీసుకునే వారు కూడా ఇలాంటి విషయాలను జాగ్రత్తగా గమనించాలి. ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలోనే తన ఇన్సూరెన్స్ మొత్తం కుటుంబానికి చెందిన ఉండే కాలం ను చూస్ చేసుకుని దానిపై క్లిక్ చేసుకోవాలి. లేకుంటే ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత అప్పులు ఎక్కువగా చేసినట్లయితే.. అప్పు ఇచ్చిన బ్యాంకు వారు ఇన్సూరెన్స్ డబ్బులను మొత్తం తీసుకుంటారు. అయితే ముందుగానే కుటుంబానికి చెందే విధంగా టిక్ చేసుకుంటే బ్యాంక్కులతో పాటు కోర్టు కూడా ఈ డబ్బులను ముట్టే అవకాశం ఉండదు.
Also Read: చాణక్య నీతి: జీవితం నాశనం కావడానికి ఈ రెండు లక్షణాలు చాలు…
ఇవే కాకుండా ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో? ఎంత టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుందో పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత ముందుకు వెళ్లాలి. ఒకసారి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ తర్వాత దానిని మార్చడానికి అవకాశం ఉండదు. అలా మార్చకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి.