Coolie Day 2 Collections: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajanikanth ) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కూలీ'(Coolie Movie) కి మొదటి రోజు కాస్త డివైడ్ టాక్, యావరేజ్ రేంజ్ రేటింగ్స్ వచ్చినప్పటికీ, కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్ద సెన్సేషన్ ని సృష్టించిన సంగతి తెలిసిందే. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజున 151 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. 10 కోట్లు వస్తే వంద కోట్ల పోస్టర్స్ ని దింపే నిర్మాతలు ఉన్న ఈరోజుల్లో, 151 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినప్పటికీ కూడా నిర్మాతలు ఎలాంటి ఫేక్ కలెక్షన్స్ వెయ్యకుండా, వచ్చిన గ్రాస్ వసూళ్లనే పోస్టర్స్ లో వేసి చూపించారు. బహుశా ఇండియా లో ఇప్పటి వరకు ఇలా ఏ నిర్మాత కూడా చేసి ఉండదు. సన్ పిక్చర్స్ ని చూసి ఇతర నిర్మాతలు కూడా మారితే బాగుంటుంది.
మొదటి రోజు ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, రెండవ రోజు కూడా అద్భుతమైన వసూళ్లను నమోదు చేసుకుంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండవ రోజున 85 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే రజినీకాంత్ శివ తాండవమే ఆడాడు అని చెప్పాలి. అనేక ప్రధాన నగరాల్లో ‘వార్ 2’ కి ఇచ్చిన థియేటర్స్ ‘కూలీ’ కి షిఫ్ట్ చేశారు. ప్రతీ చోట రికార్డు స్థాయి ఆక్యుపెన్సీలు నమోదు అయ్యాయి. రజినీకాంత్ సినిమాకు ఇలాంటివి మన తెలుగు రాష్ట్రాల్లో చూసి చాలా కాలం దాటింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం రెండవ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. కేవలం తెలుగు వెర్షన్ లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.
Also Read: 2వ రోజు హిందీలో దున్నేస్తున్న ‘వార్ 2’..గ్రాస్ వసూళ్లు ఏ రేంజ్ లో ఉందంటే!
ముఖ్యంగా నార్త్ అమెరికా లో ఈ చిత్రానికి ప్రీమియర్స్ + మొదటి రోజుకి కలిపి 4 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక రెండవ రోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈ చిత్రం అక్కడ 1 మిలియన్ మార్కుని అందుకుంది. అలా రెండు రోజుల్లో ఈ చిత్రం కేవలం నార్త్ అమెరికా నుండే 5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ ఓవర్సీస్ లో ఇప్పటి వరకు 13 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి అట. ఈ వీకెండ్ ముగిసేలోపు ఈ చిత్రం 20 మిలియన్ డాలర్ల మార్కుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఓవరాల్ గా ఈ చిత్రానికి రెండు రోజుల్లో 235 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వీకెండ్ కి 400 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి