Government Scheme Auto Drivers: ఏపీలో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం కానుంది. స్త్రీ శక్తి( sthree Sakthi ) పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా జారీ అయ్యాయి. ఇంకోవైపు ఆగస్టు 15న సీఎం చంద్రబాబు విజయవాడలోని పండిట్ జవహర్ లాల్ బస్సు స్టేషన్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ పథకం ప్రారంభం అయితే ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల రద్దీ పెరగనుంది. అదే సమయంలో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి మహిళలు సైతం ఆర్టీసీ బస్సుల్లో వెళ్తారు. ముఖ్యంగా ఇది ఆటో డ్రైవర్లకు నష్టం చేకూర్చే అంశమే. అందుకే సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ల కోసం ఒక మంచి పథకాన్ని ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నారు. వారికి ఆర్థిక ప్రోత్సాహం అందించే పథకం పై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.
Also Read: ఇలా జరుగుతుందని జగన్ కి ముందే తెలుసా? అందుకే సిద్ధమవుతున్నాడా?
* ఆటో డ్రైవర్లకు నష్టం..
మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ఐదు రకాల బస్సుల్లో అనుమతి ఇచ్చారు. పల్లె వెలుగు( Palle Velugu) , ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ లలో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తారు. అయితే సాధారణంగా ఈ బస్సులలో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అయితే సమయానుకూలంగా ఈ సర్వీస్ లు లేకపోయినా సమయంలో ఆటో లను ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఇప్పుడు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించడంతో ఆటోల వైపు మహిళలు చూసే అవకాశం ఉండదు. ఇది కచ్చితంగా ఆటో డ్రైవర్ల జీవనం పై ప్రభావం చూపుతుంది. అందుకే వారికోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం.
* వైసిపి హయాంలో వాహన మిత్రగా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాహన మిత్ర( vahan Mitra ) పేరిట ఒక పథకాన్ని అమలు చేసేవారు. ఏడాదికి పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించేవారు. అయితే అప్పట్లో ఈ పథకంపై సంతృప్తి కనిపించేది. కానీ అనవసరంగా ఇస్తున్నారే అనే మాట ఎక్కువగా వినిపించేది. ఇప్పుడు మాత్రం ఉచిత ప్రయాణం ద్వారా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతోంది. వారికోసం ప్రత్యేక పథకం ప్రారంభించినా ఎటువంటి విమర్శలు రావు. ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం అమలు కానుండడంతో ఆ సన్నాహాల్లో ఉంది ఏపీ ప్రభుత్వం. అందులో భాగంగా అధికారులతో సమీక్షించారు సీఎం చంద్రబాబు. ఉచిత ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తూనే.. ఆటో డ్రైవర్లకు ప్రయోజనం కలిగించే పథకంపై అధ్యయనం చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. దీనిపై ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆటో డ్రైవర్ల ప్రత్యేక పథకం మార్గదర్శకాలు విడుదల చేసే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో?