Coolie vs War 2: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కూలీ’ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాతో పాటు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన అయాన్ ముఖర్జీ గతంలో చేసిన వార్ సినిమా కి సీక్వెల్ గా హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ లను హీరోలుగా పెట్టి వార్ 2 సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకుంది… అనే విషయం మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. నిజానికి ఈ రెండు సినిమాలు సక్సెస్ ని సాధించాయా? లేదంటే రెండు సినిమాలు ఫెయిల్యూర్ గా మారాయా? లేకపోతే ఒక సినిమా సక్సెస్ అయి మరో సినిమా ప్లాప్ అయిందా.? అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Also Read: కోలీవుడ్ 1000 కోట్ల కల ‘కూలీ’ నెరవేర్చేనా..? మొదటి రోజు వసూళ్లు ఎలా ఉన్నాయంటే!
ముందుగా కూలీ సినిమా విషయానికి వస్తే లోకేష్ కనకరాజు ఈ సినిమాని చాలా ప్రస్టేజియాస్ గా తెరకెక్కించాడు. చాలామంది స్టార్ కాస్టింగ్ ను పెట్టుకొని తెరకెక్కించిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తూ మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది.
ఇక రజనీకాంత్ చాలా రోజుల తర్వాత తన మేనరిజమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఇప్పటివరకు ఆయన కెరీర్ లో చేసిన అన్ని పాత్రల తాలూకు ఇంపాక్ట్ ను ఈ పాత్ర మీద పడకుండా సెపరేట్ గా ఒక ఫ్రెష్ క్యారెక్టర్ ని పోషించినట్టుగా రజనీకాంత్ ఈ సినిమాలో నటించి మెప్పించాడు… ఓవరాల్ గా ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది.
ఇక వార్ 2 సినిమా విషయానికి వస్తే ఇది ఒక రా ఏజెంట్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కింది. మరి ఈ సినిమా కూడా ప్రేక్షకులను కొంతవరకు అలరించినప్పటికి ఎన్టీఆర్ అభిమానులను మాత్రం చాలా వరకు నిరాశపరిచిందనే చెప్పాలి. దానివల్ల ఈ సినిమాకి మొదటి షో నుంచి డివైడ్ టాక్ అయితే వచ్చింది. మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధించాలని ఎన్టీఆర్ ఈ సినిమా చేశాడో అలాంటి సక్సెస్ ని ఈ సినిమా సాధించకపోవచ్చు.
Also Read: ‘కూలీ’ ఓవరాల్ పబ్లిక్ టాక్ ఇదే..బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి!
అలాగే ఈ మూవీకి కలెక్షన్స్ కూడా భారీగా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి… కూలీ vs వార్ 2 మధ్య జరుగుతున్న పోటీలో కూలీ సినిమా వార్ 2 ను బీట్ చేసి మరి ముందుకు దూసుకెళ్తుంది. అలాగే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో కూలీ సినిమా భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి…