Jr NTR War 2 Success: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి సాధ్యం కాని రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఆయన వరుసగా ఏడు విజయాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా అభిమానులందరిని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో చేసిన వార్ 2 సినిమా ఇండియా లో రేపు రిలీజ్ అవుతోంది… ఈ సినిమా సక్సెస్ అయితే జూనియర్ ఎన్టీఆర్ తన ఎంటైర్ కెరియర్ లోనే ఇప్పటివరకు ఎవ్వరు సాధించినటువంటి ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. ఇక ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఏడు సినిమాలతో సూపర్ హిట్లను సాధించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఎనిమిదోవ విజయాన్ని కూడా సాధిస్తే పవన్ కళ్యాణ్, నాని పేర్ల మీదున్న ఏడు సినిమాల రికార్డుని బ్రేక్ చేస్తూ ఎన్టీఆర్ ఎనిమిదోవ విజయాన్ని సాధించి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేసినవాడు అవుతాడు… ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు సైతం దానికోసమే ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘వార్ 2’ పై ‘కూలీ’ డామినేషన్..? బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే!
మరి ఈ సినిమా ఎన్టీఆర్ ని పాన్ ఇండియాలో స్టార్ హీరోగా మారుస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతోంది.
లేకపోతే మాత్రం ఆయన భారీగా వెనుకబడి పోయే అవకాశాలు కూడా ఉన్నాయి… మొత్తానికైతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ సాధించిన ఘనత అంతా ఇంతా కాదు… ఇకమీదట ఆయన పాన్ ఇండియాని కూడా షేక్ చేస్తూ ఇప్పుడున్న హీరోలందరికి పోటీని ఇవ్వగలుగుతాడా లేదా అనేది డిసైడ్ అవ్వాలంటే వార్ 2 సినిమా సూపర్ సక్సెస్ సాధించాల్సిన అవసరమైతే ఉంది…
Also Read: కూలీ దెబ్బ కి హ్యాంగ్ అయిన యాప్.. రజినీకాంత్ అంటే అలా ఉంటది మరి…
హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు కాబట్టి ఈ సినిమాలో ఎవరు ఎవరిని డామినేట్ చేయబోతున్నారు అనేది కూడా కీలకమైన అంశంగా మారబోతోంది. హృతిక్ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని ఈ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలిపి తను కూడా టాలెంటెడ్ యాక్టర్ గా మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…