Heeramandi: సాధారణంగా కొన్ని సినిమాలు ఒక ఊరు, పట్టణం లేదా దేశం వంటి వాటి గురించి వస్తుంటాయి. చాలా సినిమాల్లో ఇలాంటివి చూస్తుంటాము. పాకిస్థాన్, ఇండియా వంటి వాటి గురించి చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని వ్యక్తుల గురించి కూడా సినిమాలు వస్తుంటాయి. రీసెంట్ గా టైగర్ నాగేశ్వర రావు అనే వ్యక్తి గురించి సినిమా వచ్చింది. ఒక సీఎం, పీఎంల గురించి సినిమాలు వస్తుంటాయి.
రంగస్థలం సినిమా గురించి తెలిసిందే. ఇది ఒక గ్రామం. ఫిక్షనల్ విలేజ్ గురించి ఈ సినిమాలో అద్భుతంగా చెప్పారు. కానీ ఈ ఊరి పేరు మాత్రం నిజంగా లేదు. ఇలా చాలా సినిమాలు కల్పిత ప్రాంతాలు, ప్రదేశాల గురించి వస్తుంటాయి. కానీ కొన్ని వెబ్ సిరీస్, సినిమాలలో నిజమైన ప్రాంతాల గురించి చెబుతుంటారు. కానీ వాటికి కాస్త ఎమోషనల్ ను జోడిస్తారు. ఈనెల ప్రారంభంలోనే రిలీజైన హీరామండి సిరీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఒక రియల్ ప్లేస్ బ్యాక్ డ్రాప్ తో వచ్చింది హీరామండి. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో ట్రెండింగ్ లో నిలుస్తోంది. సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన ఈ నెట్ ఫ్లిక్స్ సిరీస్ పాకిస్థాన్ లోని ఒక రెడ్ లైట్ ఏరియా గురించి లాహోర్ లోని ఈ ఏరియాను సెటప్ వేశారు. హీరామండి లేదా డైమండ్ మార్కెట్ పిలుస్తారట. అయితే ఈ వెబ్ సిరీస్ చాలా చర్చనీయాంశమైందనే విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రజలలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. అయితే ఇదొక నిజమైన ప్రాంతం. దీనికి సంబంధించిన వీడియోలతో సహా ఒక డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కూడా తాజాగా వెల్లడించింది.