Bigg Boss OTT 3
Bigg Boss OTT 3: బిగ్ బాస్ రియాలిటీ షో హిందీ వర్షన్ ఇప్పటికే 17 సీజన్లు పూర్తి చేసుకుంది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పదికి పైగా సీజన్స్ కి హోస్ట్ గా వ్యవహరించి రికార్డు సృష్టించాడు. ఈ షో రెండేళ్ల క్రితం ఓటిటీ లో కూడా ప్రారంభించారు. ఇప్పటికే ఓటీటీలో రెండు సీజన్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో సీజన్ 3 త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరిగాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా నిర్వాహకులు పూర్తి చేశారు.
కంటెస్టెంట్ల ఎంపిక కూడా పూర్తి అయిన తరుణంలో అనూహ్యంగా ఓటిటీ సీజన్ 3 రద్దు అయినట్లు తెలుస్తుంది. ఆల్రెడీ సీజన్ 3 పై అధికారిక ప్రకటన చేశారు. ఇక సోషల్ మీడియా ద్వారా ప్రచారం కూడా ప్రారంభించారు. ఇలా సడన్ గా బిగ్ బాస్ ఓటిటీ సీజన్ 3 క్యాన్సిల్ అవ్వడానికి కారణాలు పరిశీలిస్తే. కొద్దిరోజుల క్రితం సల్మాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనే అంటున్నారు.
కాల్పుల ఘటన తర్వాత సల్మాన్ ని ఎలాగైనా చంపేస్తాం అంటూ వచ్చిన బెదిరింపు సందేశాలు దుమారం రేపాయి. ఆ దుండగులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కి చెందిన వారని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సల్మాన్ కి సెక్యూరిటీ మరింత కట్టుదిట్టం చేశారు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల నడుమ షో నిర్వహించడం కష్టం అని నిర్వాహకులు భావించారట. అందుకే తాత్కాలికంగా షో నిలిపివేశారని సమాచారం. దీంతో 2025 లో ఓటిటీ సీజన్ 3 ఉండొచ్చు అని తెలుస్తుంది.
గతంలో వరుస సమస్యలతో విసిగిపోయి సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ మానేయాలని అనుకున్నారట. నిర్వాహకులకు ఈ విషయం చెప్పగా మీరే చేయాలని సల్మాన్ ఖాన్ ని రిక్వెస్ట్ చేశారట. చేసేదేమీ లేక ఒప్పుకున్నానని సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కాగా ఓటీటీ వెర్షన్ సడన్ గా నిలిపివేయడంతో బిగ్ బాస్ లవర్స్ కి గట్టి షాక్ తగిలినట్లయింది. ఈ వార్త తెలుసుకుని ఒకింత నిరాశ చెందుతున్నారు. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ హోస్ట్ గా వందల కోట్లు సంపాదిస్తున్నాడని సమాచారం.
Web Title: Bigg boss ott 3 salman khan makers remove post of announcement after security concerns
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com