Surya: సూర్య తో కలిసి సినిమా చేయడానికి రెడీ అవుతున్న బాలివుడ్ స్టార్ హీరో…

ప్రస్తుతం బాలీవుడ్ హీరోలందరూ సౌత్ సినిమా దర్శకులను గాని, హీరోలను గాని వాడుకొని సక్సెస్ సాధించాలని చూస్తున్నారు. ఇక అందులో భాగంగానే అక్కడి స్టార్ హీరోలు ఇప్పటికే సౌత్ సినిమా దర్శకులతో సినిమాలను చేస్తూ మంచి విజయాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు...

Written By: Gopi, Updated On : September 12, 2024 5:48 pm

Surya

Follow us on

Surya: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటులలో సూర్య మొదటి స్థానంలో ఉంటాడు. తను చేసిన గజినీ సినిమా నుంచి కంగువా సినిమా వరకు ప్రతి సినిమా విషయంలో అతను పర్ఫెక్షన్ అనేది మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఆయన లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లేకపోవడం నిజంగా మన దురదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక పాత్ర కోసం ఎంతలా అయినా సరే కష్టపడతాడు. దానికి సంబంధించిన మేకోవర్ ను సంపాదించుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటాడు.ఇక ఒక వ్యక్తి సిక్స్ ప్యాక్ ని మెయింటైన్ చేస్తూ ఉండడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అయినప్పటికీ సూర్య మాత్రం ఎప్పుడూ సిక్స్ ప్యాక్ ని మెయిటైన్ చేస్తూనే ఉంటాడు. అలాంటి వ్యక్తి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అయిన అమీర్ ఖాన్ మరొక సినిమా అయితే చేయలేదు. ఇక ఇలాంటి క్రమంలోనే తను చేయబోయే సినిమాలో సూర్యని హీరోగా తీసుకుని మల్టీ స్టారర్ సినిమాగా తెరకెక్కించాలనే ఉద్దేశ్యంలో అమీర్ ఖాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. నిజానికి అయితే సూర్య చేసిన గజినీ సినిమాని హిందీలో అమీర్ ఖాన్ అదే పేరుతో రీమేక్ చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

కాబట్టి అప్పటినుంచి వీళ్ళ మధ్య మంచి బాండింగ్ అయితే కుదిరింది. అందుకే సూర్య చేసే సినిమాలను చేయడానికి అమీర్ ఖాన్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. కానీ ప్రస్తుతం సూర్య పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకుంటున్నాడు. కాబట్టి అమీర్ ఖాన్ ఇప్పుడు తను నెక్స్ట్ చేయబోయే సినిమాలో తన తమ్ముడి క్యారెక్టర్ లో సూర్యని తీసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఆ క్యారెక్టర్ కి కూడా హీరోతో సమానమైన స్క్రీన్ టైమ్ ఉండటమే కాకుండా ఆ పాత్రకి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంటుందట. అందువల్లే ఆ పాత్ర కోసం సూర్య ని తీసుకోబోతున్నట్టుగా అమీర్ ఖాన్ తన సన్నిహితుల దగ్గర తెలియజేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక సూర్య మాత్రం దీని మీద ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు. ఒక రకంగా తనకి ఆ సినిమా చేయడం ఇష్టం ఉందా లేదా అనే విషయాన్ని కూడా తను బయటికి చెప్పలేకపోతున్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కంగువా సినిమా మీదనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక తన మనసులోని మాటను బయట పెడుతాడేమో చూడాలి…