https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ మణికంఠ కు ‘బ్రహ్మముడి’ కావ్య క్షమాపణలు.. అసలు ఏమి జరిగిందంటే!

యూట్యూబర్ అని, సోషల్ మీడియా లో టాప్ సెలబ్రిటీ అని కొంతమంది చెప్పడం వల్ల ఈయన నలుగురికి తెలిసాడు కానీ,టీవీ ని వీక్షించే ప్రేక్షకులకు మాత్రం ఇతను ఎవరో తెలియదు. అయినప్పటికీ కూడా హౌస్ లోకి అడుగుపెట్టే ముందు ఇతని విషాదమైన బ్యాక్ గ్రౌండ్ చెప్పగానే ప్రేక్షకులు కరిగిపోయారు. మొదటి ఎపిసోడ్ తోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. తల్లి చనిపోయింది..తండ్రి వదిలేసాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 12, 2024 / 05:57 PM IST

    Bigg Boss 8 Telugu(38)

    Follow us on

    Bigg Boss 8 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో మొదటి ఎపిసోడ్ తోనే మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నాగ మణికంఠ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇతను హౌస్ లోకి అడుగు పుట్టినరోజు ఇతను ఎవరో కూడా ఎవరికీ తెలియదు. యూట్యూబర్ అని, సోషల్ మీడియా లో టాప్ సెలబ్రిటీ అని కొంతమంది చెప్పడం వల్ల ఈయన నలుగురికి తెలిసాడు కానీ,టీవీ ని వీక్షించే ప్రేక్షకులకు మాత్రం ఇతను ఎవరో తెలియదు. అయినప్పటికీ కూడా హౌస్ లోకి అడుగుపెట్టే ముందు ఇతని విషాదమైన బ్యాక్ గ్రౌండ్ చెప్పగానే ప్రేక్షకులు కరిగిపోయారు. మొదటి ఎపిసోడ్ తోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. తల్లి చనిపోయింది..తండ్రి వదిలేసాడు..భార్య కూడా దూరమైంది, ఆత్మహత్య చేసుకునే సమయంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది అంటూ ఇతను మాట్లాడిన మాటలను చూస్తే ఎలాంటి కఠినమైన మనిషికి కూడా గుండె కరిగిపోతుంది. హౌస్ లో ఇతని బ్యాక్ గ్రౌండ్ తెలియని కంటెస్టెంట్స్, మొదటి ఎపిసోడ్ లోనే టార్గెట్ చేసి నామినేట్ చేసారు.

    దీనికి ఎమోషనల్ అయిపోయిన నాగ మణికంఠ, బయటకు వెళ్తే నాకు వేరే బ్రతుకు కూడా తెలియదు అంటూ వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ, తన నెట్టి మీద పెట్టుకున్న విగ్ ని తొలగిస్తాడు. దీనిపై సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ నడిచాయి. సోషల్ మీడియా అన్న తర్వాత ఇలాంటివి సర్వసాధారణం, కానీ ఒకే సీరియల్ కుటుంబానికి చెందిన ఆర్టిస్టులు కూడా దీనిపై ట్రోల్ల్స్ చేయడం సరైన పద్దతి కాదు. ‘బ్రహ్మముడి’ సీరియల్ లో కావ్య గా అశేష ప్రేక్షకాభిమానం పొందిన దీపిక ఎంటర్టైన్మెంట్ షోస్ లో ఎంత హుషారుగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమె హుషారుని, మాట్లాడే తీరుని యాంకర్స్ సైతం తట్టుకోలేరు. అంతటి హైపర్ యాక్టీవ్ గా ఉంటుంది.

    రీసెంట్ గా ఈమె స్టార్ మా ఛానల్ లో ప్రతీ ఆదివారం ప్రసారమయ్యే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ ప్రోగ్రాం లో పాల్గొన్నది. ఈ ప్రోగ్రాం లోని ఒక సందర్భంలో ఆమె నాగ మణికంఠ ని ఇమిటేట్ చేస్తూ, తన నెత్తికి ధరించిన విగ్ ని తీసి పక్కన పెడుతుంది. దీనిపై సోషల్ మీడియా లో తీవ్రమైన ట్రోల్ల్స్ ఎదురయ్యాయి. నీ తోటి ఆర్టిస్ట్ బాధపడిన సంఘటన ని నీ కామెడీ కోసం వాడుకునేందుకు సిగ్గుగా లేదా అంటూ దీపిక ని నెటిజెన్స్ బాగా తిట్టారు. దీనికి స్పందించిన దీపిక మాట్లాడుతూ ‘నాగ మణికంఠ ని అభిమానించే వారు ఎవరైనా ఉంటె క్షమించండి. నేను అతనిని ఉద్దేశించి చేయలేదు. కేవలం నేను కూడా విగ్ వాడుతాను అని చెప్పేందుకే, కామెడీ కోసం అలా చేశాను’ అంటూ చెప్పుకొచ్చింది. చేయాల్సింది మొత్తం చేసి క్షమాపణలు కూడా మనస్ఫూర్తిగా చెప్పకుండా, ఎలా కవర్ చేసుకుందో చూడండి అంటూ దీపిక పై మండిపడుతున్నారు నెటిజెన్స్.