Robot Bigg Boss 9 Telugu : బుల్లితెర ప్రేక్షకులు అమితంగా ఇష్టపడే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో ఈ రియాలిటీ షో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు లో ఇప్పటికే 8 సీజన్స్ పూర్తి అయ్యాయి. సెప్టెంబర్ నెలలో 9వ సీజన్(Bigg Boss 9 Telugu) కూడా మొదలు కాబోతుంది. ఈ సీజన్ లో ఎన్నడూ లేని విధంగా మనలాంటి సామాన్యులకు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం కల్పించారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక అప్లికేషన్ ని విడుదల చేసి ఆసక్తి ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రచారం కూడా మొదలు పెట్టారు. మొత్తం మీద 5 మంది సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇలా తెలుగు సీజన్ కి ప్లాన్ చేస్తే, త్వరలో ప్రసారం అవ్వబోయే హిందీ సీజన్ కి మరో లెవెల్ ప్లానింగ్ చేశారు.
గత సీజన్ లో గాడిదని కొన్ని రోజులు కంటెస్టెంట్ గా లోపలకు పంపారు. ఈ ఘటన అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఈ సీజన్ లో ఎవ్వరూ ఊహించని విధంగా ఒక AI రోబో ని కంటెస్టెంట్ గా లోపలకు పంపబోతున్నారు. ఈ రోబో పేరు హాబాబు అట. ఒక మనిషికి ఉన్న ఎమోషన్స్ మొత్తం ఈ రోబో కి ఉంది. మనిషి కంటే వెయ్యి రేట్ల సామర్థ్యం తో పనులు చేయగలడు. ఒక భాష కాదు, ఏకంగా 7 భాషలను ఈ రోబో మాట్లాడగలడు. ఇలాంటి రోబో తో కంటెస్టెంట్స్ పోటీ పడబోతున్నారు. ఊహిస్తేనే ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది కదూ. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోబో తో కంటెస్టెంట్స్ పోటీ పడి గెలవాలి కాబట్టి , త్వరలో ప్రారంభం అవ్వబోయే హిందీ బిగ్ బాస్ సీజన్ మనుషులు వెర్సస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గా పరిగణించొచ్చు.
Also Read: రామ్ చరణ్ పెద్ది మూవీలో ఐటమ్ సాంగ్ చేస్తున్న స్టార్ హీరోయిన్…
ఈ హాబాబు అనే రోబో ని UAE ప్రాంతం నుండి తెప్పిస్తున్నారట. దీనికి సంబందించిన మరికొన్ని వివరాలు త్వరలోనే తెలియనుంది. ఈ కాన్సెప్ట్ మన తెలుగు లో కూడా పెడితే బాగుంటుంది కదూ..?, కానీ ఈ సీజన్ కాన్సెప్ట్ ఇప్పటికే రెడీ అయిపోయింది. హిందీ లో ఈ రోబో కాన్సెప్ట్ కి వచ్చే రెస్పాన్స్ ని చూసి తెలుగు లో కూడా ప్లాన్ చేయొచ్చు. కచ్చితంగా హిందీ బిగ్ బాస్ టీం తీసుకున్న కాన్సెప్ట్ ఒక సెన్సేషన్ అనే చెప్పొచ్చు. టీఆర్ఫీ రేటింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మన తెలుగు లో ఈసారి ఏ కాన్సెప్ట్ తో రాబోతున్నారు అనేది ఇంకా తెలియదు. సీజన్ 7 ‘ఉల్టా..పల్టా’ కాన్సెప్ట్ మీద నడిచింది. సీజన్ 8 ఇన్ఫినిటీ కాన్సెప్ట్ మీద నడించింది. ఇక సీజన్ 9 గురించి తెలియాల్సి ఉంది.