Rs. 4 crore spent on Gutka Stains: భారత దేశంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో ఎక్కడ చూసినా గుట్కా మరకలే కనిపిస్తాయి. ఇక రైళ్లలో, బస్సుల్లోనూ ఉమ్మిన మరకలు కనిపిస్తుంటాయి. వాటి కారణంగా ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటారు. అయితే భారత రైల్వే ఇలాంటి మరకల తొలింపునకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం రోజుకు రూ.4 కోట్లు కర్చు చేస్తోంది.
రైల్వేలకు ఆర్థిక భారం..
భారత రైల్వే స్టేషన్లు, రైళ్లలో గుట్కా, పాన్ మసాలా మరకలు కామన్‌గా మారాయి. ఈ మరకలను తొలగించడానికి రైల్వే రోజుకు రూ. 4 కోట్లు ఖర్చు చేస్తోంది, సంవత్సరానికి ఇది రూ.1,200 కోట్లకు సమానం. ఈ ఖర్చు శుభ్రపరచడం, రీ–పెయింటింగ్, నీటి వినియోగం, మానవ వనరులకు సంబంధించినది. ఈ భారీ వ్యయం రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగపడే నిధులను గణనీయంగా తగ్గిస్తోంది.
Also Read: చైనా పార్ట్స్ తో భారత్ లో డ్రోన్స్.. మన దేశానికే ముప్పు?
కొత్త రసాయనాలకు పరిశోధన..
గుట్కా మరకల తొలగింపు ఖర్చులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సైంటిస్టులతో కొత్త రసాయనాలను అభివృద్ధి చేయిస్తోంది. ఈ పరిశోధన లక్ష్యం సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో మరకలను తొలగించే రసాయనాలను కనుగొనడం. అయితే, ఈ పరిశోధనను కొందరు అమెరికాలో నాసా యొక్క జూపిటర్ ఉపగ్రహ పరిశోధనలతో పోల్చి, గుట్కా మరకలపై పరిశోధనను విడ్డూరంగా భావిస్తున్నారు. ఈ విమర్శలు గుట్కా వినియోగంపై కఠిన నిషేధ చర్యల అవసరాన్ని సూచిస్తున్నాయి.
సింంగపూర్‌లో కఠిన చర్యలు..
సింగపూర్‌లో గుట్కా నమలడం, ఉమ్మడం కఠిన నేరంగా పరిగణించబడుతుంది, దీనికి రూ. 3.80 లక్షల జరిమానా విధిస్తారు. చెల్లించకపోతే, కేసు సుప్రీం కోర్టు వరకు చేరుతుంది. ఈ కఠిన చర్యలు సింగపూర్‌లో ప్రజా ప్రదేశాల శుభ్రతను కాపాడుతున్నాయి. భారత్‌లో కూడా ఇలాంటి కఠిన జరిమానాలు, చట్టాలను అమలు చేయడం ద్వారా గుట్కా వినియోగాన్ని నియంత్రించవచ్చు. సింగపూర్‌తో పోల్చితే, భారత్‌లో గుట్కా నిషేధం అమలు బలహీనంగా ఉంది, ఇది శుభ్రత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది.
Also Read: చిన్నమ్మకు బిజెపి జాతీయ పగ్గాలు?!
గుట్కా వినియోగం వల్ల ప్రజా ప్రదేశాల శుభ్రతతోపాటు, ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. గుట్కా క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ, అక్రమ గుట్కా వ్యాపారం, నిషేధ అమలులో లోపాలు సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించడం, గుట్కా వినియోగంక్` ఆరోగ్య, శుభ్రతా ప్రభావాలను వివరించడం అవసరం.