Bollywood Heroine: ఈ వయ్యారి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో ఒక ప్రముఖ దర్శకుడితో సినిమా చేస్తుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అయితే ఈమె సినీ ప్రయాణం అంత ఈజీగా జరగలేదు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేముందు ఆమెకు భిన్నమైన ఆకాంక్షలు ఉండేవి. ఈ బ్యూటీ మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుని స్టార్ కావడానికి ముందే ఈమెకు ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనే కోరిక ఉండేది. కానీ తన సోదరుడి కారణంగా ఆమె మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె మిస్ ఇండియా విజేతగా నిలవడంతో ఈమె జీవితం ఒక్కసారిగా మారిపోయిందని చెప్పొచ్చు.
దాంతో నాసాలో చేరాలని ఆమె కోరిక అక్కడితో ఆగిపోయింది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఆమె ఎదుగుదల అంత ఈజీగా జరగలేదు. కెరియర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను సమస్యలను ఎదుర్కొంది. ప్రస్తుతం గ్లోబల్ బ్యూటీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు ప్రియాంక చోప్రా. ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ గెల్చుకున్న తర్వాత బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఇంటర్వ్యూ ఇచ్చింది. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్గా మారిపోయింది. సినిమా ఇండస్ట్రీలో అప్పటికే స్థిరపడిన తారలు ఆధిపత్యం చెలాయించే ఇండస్ట్రీలో తనను తాను నిరూపించుకోవడానికి అలాగే ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. 2003లో ప్రియాంక చోప్రా అందాజ్ సినిమాతో తనదైన ప్రత్యేకముద్రను వేసింది. ఆ తర్వాత హిందీలో డాన్, డాన్ 2 సినిమాలలో నటించి ప్రశంసలు అందుకుంది. అలాగే ఫ్యాషన్స్ సినిమాతో నటిగా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంది.
View this post on Instagram
ఒక ఆటిస్తిక్ మహిళగా బర్ఫీ సినిమాలో ఈమె నటన గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఈమె తన సినిమా కెరియర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించింది. ప్రియాంక చోప్రా 2015లో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె 2015లో అమెరికన్ టీవీ సీరియల్స్ క్వాంటికోలో నటించింది. అతితక్కువ సమయంలోనే ఆమె ప్రపంచాల వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా అలాగే వ్యాపారవేత్తగా కూడా రాణించింది. అలాగే ఈ గ్లోబల్ బ్యూటీ అమెరికా సింగర్ నిక్ జొనాస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు మాల్టీ మేరీ జొనస్ అనే పాప కూడా ఉంది. ప్రస్తుతం ఈ గ్లోబల్ బ్యూటీ రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: కాజోల్ కూతురి స్టన్నింగ్ ఫోటోలను చూశారా.. త్వరలో సినిమాలలోకి ఎంట్రీ..