Star Heroine: ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో కేవలం ఒకే ఒక సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్స్ గా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు.వీళ్ళు తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంటున్నారు. తమ అందం, అభినయంతో వెండితెరపై మాయ చేస్తూ ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు. అలాగే తమ నటనతో తొలి సినిమాతోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు.విభిన కథలు ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుంటూ తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా చాలా స్పెషల్. తెలుగులో ఈమె కేవలం ఒక్క సినిమాతోనే టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో బాగా ఫేమస్ అయ్యింది.అతి తక్కువ సమయంలోనే సౌత్ సినిమా ఇండస్ట్రీలో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్గా కూడా మారిపోయింది. గ్లామర్ షోకు దూరంగా ఉన్న ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నటనపరంగా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న ఈ వయ్యారి కరాటేలో కూడా బ్లాక్ బెల్ట్ తీసుకుంది. మ్యాడ్ సినిమాతో ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయం అయింది. మొదటి సినిమాతోనే తన అందంతో, అభినయంతో అలాగే నటనపరంగా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.
త్వరలో మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోబోతుంది.
Also Read: కాజోల్ కూతురి స్టన్నింగ్ ఫోటోలను చూశారా.. త్వరలో సినిమాలలోకి ఎంట్రీ.
ఈ హీరోయిన్ పేరు ఆనంతిక సునీల్ కుమార్. ఆనంతిక మ్యాడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయం అందుకుంది. అనంతిక కేరళకు చెందిన అమ్మాయి. ఈమె తనకు ఐదేళ్ల వయసులోనే శాస్త్రీయ నాట్యంలో శిక్షణ కూడా తీసుకుంది. అనంతిక కథాకళి, మోహిని అట్టం, భరతనాట్యం, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలలో ప్రావిణ్యం పొందింది. అలాగే ఈ ముద్దుగుమ్మ మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ పొందింది. ఈమె కరాటే లో బ్లాక్ బెల్ట్ హోల్డర్.

అలాగే కేరళ ప్రత్యేకమైన కలరిపైఎట్టు మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకుంది. గత ఏడాది ఇంటర్ పూర్తి చేసిన అనంతిక మ్యాడ్ సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమాతో ఈ అమ్మడు తెలుగులో బాగా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఈమె ఎనిమిది వసంతాలు అనే సినిమాలో నటిస్తుంది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా అనంతిక షేర్ చేసిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాలలో అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.