Kajol Daughter: కాజోల్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు జోడిగా అత్యధిక సినిమాలలో నటించిన ఏకైక హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో ఈమె ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా దూసుకుపోయింది. పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించిన కాజోల్ ప్రస్తుతం మళ్ళీ సినిమాలలో రీఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో 90’ s లో వరుసగా సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్న హీరోయిన్లలో కాజోల్ కూడా ఒకరు. ఈమె వరసగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ముఖ్యంగా కాజోల్ బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కి జోడిగా అత్యధిక సినిమాలలో నటించింది. షారుక్ ఖాన్, కాజోల్ పెయిర్ కు అభిమానులలో బాగా ఫాలోయింగ్ ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ కెరియర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ లో మరో స్టార్ హీరో అయిన అజయ్ దేవగన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉంది కాజోల్. ప్రస్తుతం మళ్ళీ ఇప్పుడు సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం కాజోల్ అటు సినిమాలు ఇటు వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది.
Also Read: మరో బాలీవుడ్ స్టార్ హీరోతో శ్రీలీల రొమాన్స్..అదృష్టం మామూలుగా లేదుగా!
ఇది ఇలా ఉంటే తాజాగా అజయ్ దేవగన్, కాజోల్ దంపతులకు ఫోటోలు సామాజిక మాధ్యమాలలో అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ లేటెస్ట్ పిక్స్ సామాజిక మాధ్యమాలలో హల్చల్ చేస్తున్నాయి. హీరోయిన్ కాజోల్ కూతురి ఫోటోలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అజయ్ దేవగన్, కాజోల్ కూతురి పేరు నైసా. నైసా అచ్చం తన తల్లిలాగే అందంగా ఉంది అంటూ, తన తల్లికి బ్లూ ప్రింట్ మాదిరిగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే నైసా, కాజోల్ ఇద్దరు కూడా అక్క చెల్లెలు లాగా కనిపిస్తున్నారని వాళ్ళిద్దరూ ఒకేలాగా ఉన్నారంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాజోల్ కూతురు నైసర్ సినిమాలకు దూరంగా ఉంటుంది.
కానీ సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న నైసర్ ఫోటోలను చూస్తే మాత్రం త్వరలో ఆమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా కాజోల్ తన కూతురి సినీరంగ ఎంట్రీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పింది. తన కూతురికి ఆసక్తి ఉంటే తప్పకుండా సినిమా ఇండస్ట్రీ లోకి వస్తుంది అంటూ కాజోల్ తెలిపింది. కానీ తాను తన కూతురికి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ గురించి ఎలాంటి సలహాలను ఇవ్వలేదంటూ తెలిపింది. కాజోల్, అజయ్ దేవగన్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో హీరోయిన్స్ గా గుర్తింప తెచ్చుకున్నారు. గతంలో కూడా వీళ్ళిద్దరూ కలిసి చాలా హిట్ సినిమాలలో నటించారు.
View this post on Instagram