Jersey Movie: ఆ గాయం వల్ల 25 కుట్లు పడ్డాయని చెప్పిన హీరో షాహిద్ కపూర్…

Jersey Movie: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమా గురించి, నాని క్యారెక్టర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు అని చెప్పాలి. ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. నాని కెరీర్ లో ఈ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది… అల్లానే ప్రశంసలు కూడా దక్కాయి. కాగా ఇప్పుడు షాహిద్ కపూర్ హీరోగా ‘జెర్సీ’ని హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ను కూడా విడుదల […]

Written By: Raghava Rao Gara, Updated On : November 28, 2021 5:25 pm
Follow us on

Jersey Movie: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమా గురించి, నాని క్యారెక్టర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు అని చెప్పాలి. ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. నాని కెరీర్ లో ఈ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది… అల్లానే ప్రశంసలు కూడా దక్కాయి. కాగా ఇప్పుడు షాహిద్ కపూర్ హీరోగా ‘జెర్సీ’ని హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. డిసెంబర్ 31న సినిమా విడుదల కానుంది. అయితే ఈ సంధర్భంగా హీరో షాహిద్ కపూర్ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన షాహిద్ ఈ మూవీ గురించి పలు విషయాలు వెల్లడించారు. ఈ సినిమా కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆయన ముఖానికి బాల్ తగిలింది. అప్పుడు ఆయన హెల్మెట్ పెట్టుకోలేదని… దాంతో పెదవికి పెద్ద దెబ్బ తగిలింది అని తెలిపారు. దాని వల్ల రెండు నెలలు షూటింగ్ ఆపేశాం. నాకు పాతిక కుట్లు పడ్డాయి. నా ముఖం మళ్లీ ఇంతకు ముందులా కనిపిస్తుందని అనుకోలేదు. నా పెదవి నార్మల్ అవ్వడానికి మూడు నెలలు పట్టింది. ఇంకా పూర్తిగా నార్మల్ అవ్వలేదనుకోండి. కొంత భాగానికి స్పర్శ తెలియడం లేదు. ఈ సినిమా కోసం నా రక్తం చిందించాను” అని షాహిద్ కపూర్ పేర్కొన్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి భారీ విజయం అందుకున్నాడు షాహిద్ కపూర్. ఇప్పుడు మరో తెలుగు సినిమా ‘జెర్సీ’ని రీమేక్ తో విజయం సాధిస్తాడో లేదో చూడాలి.