Homeఎంటర్టైన్మెంట్Jersey Movie: ఆ గాయం వల్ల 25 కుట్లు పడ్డాయని చెప్పిన హీరో షాహిద్ కపూర్...

Jersey Movie: ఆ గాయం వల్ల 25 కుట్లు పడ్డాయని చెప్పిన హీరో షాహిద్ కపూర్…

Jersey Movie: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమా గురించి, నాని క్యారెక్టర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు అని చెప్పాలి. ఈ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. నాని కెరీర్ లో ఈ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది… అల్లానే ప్రశంసలు కూడా దక్కాయి. కాగా ఇప్పుడు షాహిద్ కపూర్ హీరోగా ‘జెర్సీ’ని హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. డిసెంబర్ 31న సినిమా విడుదల కానుంది. అయితే ఈ సంధర్భంగా హీరో షాహిద్ కపూర్ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు.

bollywood actor shahid kapoor shares interesting words about jersey movie

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించిన షాహిద్ ఈ మూవీ గురించి పలు విషయాలు వెల్లడించారు. ఈ సినిమా కోసం క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆయన ముఖానికి బాల్ తగిలింది. అప్పుడు ఆయన హెల్మెట్ పెట్టుకోలేదని… దాంతో పెదవికి పెద్ద దెబ్బ తగిలింది అని తెలిపారు. దాని వల్ల రెండు నెలలు షూటింగ్ ఆపేశాం. నాకు పాతిక కుట్లు పడ్డాయి. నా ముఖం మళ్లీ ఇంతకు ముందులా కనిపిస్తుందని అనుకోలేదు. నా పెదవి నార్మల్ అవ్వడానికి మూడు నెలలు పట్టింది. ఇంకా పూర్తిగా నార్మల్ అవ్వలేదనుకోండి. కొంత భాగానికి స్పర్శ తెలియడం లేదు. ఈ సినిమా కోసం నా రక్తం చిందించాను” అని షాహిద్ కపూర్ పేర్కొన్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను ‘కబీర్ సింగ్’గా రీమేక్ చేసి భారీ విజయం అందుకున్నాడు షాహిద్ కపూర్. ఇప్పుడు మరో తెలుగు సినిమా ‘జెర్సీ’ని రీమేక్ తో విజయం సాధిస్తాడో లేదో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version