https://oktelugu.com/

Producer Suresh Babu:మరో మూవీని కూడా ఓటీటీ లో రిలీజ్ చేయనున్న నిర్మాత సురేష్ బాబు… కారణం ఏంటంటే ?

Producer Suresh Babu: స్వామి రారా చిత్రంతో మంచి విజయం అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రత్యేకమైన గుర్తింపు పొందారు సుధీర్ వర్మ. ప్రస్తుతం దర్శకుడు సుధీర్ వర్మ సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది కొరియన్ రీమేక్ చిత్రం కాగా  కొన్ని మార్పులు చేసి తెలుగు వర్షన్ లో “శాకిని డాకిని” అనే టైటిల్ తో చిత్రాన్ని నిర్మించడం జరుగుతుంది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 28, 2021 / 05:54 PM IST
    Follow us on

    Producer Suresh Babu: స్వామి రారా చిత్రంతో మంచి విజయం అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రత్యేకమైన గుర్తింపు పొందారు సుధీర్ వర్మ. ప్రస్తుతం దర్శకుడు సుధీర్ వర్మ సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ఒక చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది కొరియన్ రీమేక్ చిత్రం కాగా  కొన్ని మార్పులు చేసి తెలుగు వర్షన్ లో “శాకిని డాకిని” అనే టైటిల్ తో చిత్రాన్ని నిర్మించడం జరుగుతుంది.

    ఈ చిత్రంలో నివేతా థామస్‌, రెజీనా కసాండ్ర టైటిల్ రోల్స్‌ పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇదిలా ఉంటే మూవీకి నుండి తాజా సమాచారాన్ని నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు తెలిపారు. ఈ సినిమా కుడా త్వరలో ఓటిటి వేదికగా విడుదల కాబోతుందని వెల్లడించారు. ఇటీవల సురేష్ సురేష్ ప్రొడక్షన్ లో నిర్మాణమైన ‘నారప్ప’, ‘దృశ్యం 2’ చిత్రాలు ఓటీటీలోనే విడుదలై హిట్ సాధించాయి. ఈ క్రమంలో ఇప్పుడు ‘శాకిని డాకిని’ కూడా ఓటీటీలోనే రిలీజ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారట. ఈ వార్తతో సురేష్ బాబు నిర్ణయం పట్ల మిశ్రమ స్పందన లభిస్తుంది. ఏపీలో టికెట్ల రేట్ల సమస్య కూడా ఈ సినిమాను ఓటీటీకి అమ్మడానికి ఒక కారణం. ఏ క్లాస్‌లో టికెట్ రేట్ వంద రూపాయలు అంటే పర్లేదు. కానీ బీ, సీ సెంటర్లలో మరీ రూ.20, రూ.30 అది చాలా నష్టమవుతుంది. అది సరైన నిర్ణయం కాదు. ఈ కారణాల వల్ల సినిమాలను ఓటిటీ కి ఇస్తున్నట్లు సురేష్ బాబు చెబుతున్నారు.