Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు అనుకోవచ్చు. అలాంటి మైదానాల మీద పరుగులు తీయడం కష్టం కాదు. బంతులు వేయడం కూడా ఇబ్బంది కాదు. ఒకవేళ బంతి గనుక టర్న్ అయితే వికెట్ల మీద వికెట్లు తీయవచ్చు. అంతర్జాతీయ టోర్నీలకు.. ఐపీఎల్ కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఐపీఎల్ లో సత్తా చూపించిన బౌలర్లకు అంతర్జాతీయ మ్యాచ్ లలో అవకాశాలు ఇస్తే.. ఏమాత్రం ఉపయోగం ఉండదు.
ఈ విషయం గౌతమ్ గంభీర్ కు తెలియడం లేదు. టీం ఇండియా మేనేజ్మెంట్ కు అర్థం కావడం లేదు. అందువల్లే టీమిండియా వరుస వైఫల్యాలను మూట కట్టుకుంటున్నది. అసలు టీమిండియాతో పోల్చి చూస్తే కనీసం దరిదాపుల్లో కూడా లేని ఐర్లాండ్ మీద వైట్ వాష్ కు గురైందంటే మన బౌలింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇంగ్లాండ్ మీద టి20 సిరీస్ లో ఒక్క మ్యాచ్ కూడా టీమ్ ఇండియా గెలవలేదు. ఇందులో కూడా బౌలింగ్ వైఫల్యం అద్భుతంగా కనిపించింది. ఇక వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచినప్పటికీ.. మిగతా రెండు మ్యాచ్లలో ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. సిరీస్ డిసైడర్ మ్యాచ్లో ఇండియన్ బౌలర్లు దారుణంగా బౌలింగ్ వేశారు. వికెట్ తీయడం కాదు కదా.. డాట్ బాల్ వేస్తేనే గొప్ప అన్నట్టుగా బౌలింగ్ వేశారు. ఇలాంటి స్క్రాప్ బౌలర్లతో టీమిండియా 2027 లో వన్డే వరల్డ్ కప్ ఎలా సాధిస్తుందో గౌతమ్ గంభీర్ కే తెలియాలి. తన ఏకపక్ష విధానాలతో.. జట్టును మొత్తం ఇప్పటికే అతడు నాశనం చేశాడు. ఇంకా ఏం మిగిలి ఉందో అర్థం కావడం లేదు.
స్వదేశంలో సిరీస్ గెలిచే అవకాశం లేకుండా పోతుంది. విదేశాలలో విజయం సాధించే స్థాయి లేకుండా పోతోంది. జట్టు ఇంతటి దారుణమైన ప్రదర్శన చేస్తుంటే మేనేజ్మెంట్.. ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఇప్పటికీ బుమ్రానే వజ్రాయుధం లాగా భావిస్తున్నారు. అతడు లేకపోతే ప్రత్యర్థి బ్యాటర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చే బౌలర్ లేడు. శమిని పట్టించుకోవడం మానేశారు. భువనేశ్వర్ కుమార్ ను అసలు లెక్కలోకి తీసుకోవడం లేదు. వర్క్ లోడ్ పేరుతో సిరాజ్ కు విశ్రాంతి ఇస్తున్నారు. ఇంతటి కీలకమైన బౌలర్లు జట్టుకు దూరంగా ఉన్నప్పుడు.. సిరీస్ ఎలా గెలుస్తామని బోర్డు పెద్దలు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. జట్టు కూర్పు విషయంలో కనీస స్పృహ కూడా లేకపోతే టోర్నీలు ఎలా గెలుస్తుంది.. వన్డే వరల్డ్ కప్ ఎలా సాధిస్తుంది.. అసలు జాతీయ జట్టులో చోటు తగ్గాలంటే ఐపీఎల్లో సత్తా చూపిస్తే సరిపోతుందా.. అలాంటప్పుడు డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు ఉన్నది ఎందుకు.. వాటిని రద్దుచేసి.. కేవలం ఐపిఎల్ లో సత్తా చూపిస్తేనే జాతీయ జట్టులో చోటు ఇస్తామని మేనేజ్మెంట్ ఒక ప్రకటన ఇస్తే సరిపోతుంది కదా… స్క్రాప్ బౌలర్లతో.. ఇంగ్లాండ్ జట్టు మీద గెలుస్తామని మేనేజ్మెంట్ భావించిందంటే.. అంతకుమించిన మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ఇప్పటికైనా గౌతమ్ గంభీర్ వాస్తవంలోకి రావాలి. మేనేజ్మెంట్ రియాల్టీని అర్థం చేసుకోవాలి.. కేవలం బౌలింగ్ మాత్రమే కాదు.. మిడిల్ ఆర్డర్ కూడా అత్యంత చెత్తగా ఉంది. ముందు అయ్యర్.. కేఎల్ రాహుల్.. కిషన్ వంటి వారిని పక్కనపెట్టి.. వారి స్థానంలో సమర్థవంతమైన బ్యాటర్లను తీసుకోవాలి. అప్పుడే గౌతమ్ గా మీరు కోరుకుంటున్నట్టుగా 2027లో టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించగలుగుతుంది. లేకపోతే అంతే సంగతులు.


