Homeక్రీడలుక్రికెట్‌Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది. మొత్తంగా టీమ్ ఇండియా పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా కు కాస్త రీ క్రియేషన్ కావాలి. ఈ నేపథ్యంలో త్వరలోనే టీమిండియా జింబాబ్వే లో పర్యటించబోతోంది. జింబాబ్వేలో ఆడే టీమిండియా ప్లేయర్ల జాబితాను మేనేజ్మెంట్ ప్రకటించింది. జింబాబ్వే లో భారత ప్లేయర్లు ఆడబోతున్న నేపథ్యంలో. ఒకసారి రికార్డులను పరిశీలిస్తే..

ఈనెల 23 నుంచి జింబాబ్వే జట్టుతో భారత్ మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లు హరారే వేదికగా జరుగుతాయి. 23, 25, 26 తేదీలలో భారత్ జింబాబ్వేతో పోటీపడుతుంది. భారత జట్టుకు అయ్యర్ నాయకత్వం వహిస్తాడు. ఉప నాయకుడిగా తిలక్ వర్మ కొనసాగుతాడు. అభిషేక్ శర్మ.. సూర్య వంశీ.. సిమ్రాన్ సింగ్.. కిషన్.. రింకు సింగ్.. శివం దుబే.. హర్ష్ దూబే.. షెడ్గే, అశోక్ శర్మ.. ప్రిన్స్ యాదవ్.. రవి.. మయాంక్ యాదవ్ జట్టులో చోటు దక్కించుకున్నారు.

సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం జింబాబ్వే జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో అభిషేక్ శర్మ టీమిండియాలోకి ప్రవేశించాడు. తొలి మ్యాచ్లో అతడు డక్ అవుట్ అయ్యాడు. రెండవ మ్యాచ్లో 46 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

2016లో జింబాబ్వేలో టీమిండియా పర్యటించింది. టీమిండియా తరఫున లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ బరేందర్ ఆడాడు. మొదటి మ్యాచ్ లోనే అతడు అదరగొట్టాడు. పది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

జింబాబ్వే జట్టుతో భారత్ ఇప్పటి వరకు 14 t20 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 11 మ్యాచ్లలో విజయాలు సాధించింది. ఇక ఇప్పటివరకు జింబాబ్వే చేతిలో భారత్ ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా కోల్పోలేదు.

పొట్టి ఫార్మాట్ లో జింబాబ్వే జట్టు మీద భారత్ 256/4 పరుగులు చేసింది. ఇదే హైయెస్ట్ స్కోర్. ఇక భారతదేశం మీద జింబాబ్వే చేసిన అత్యధిక స్కోరు 184/6. భారత జట్టు తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడు అభిషేక్ శర్మ (100).

ఇక ఈ సిరీస్ ద్వారా తెలుపు కుర్రాడు తిలక్ వర్మకు ప్రమోషన్ లభించింది. అతడిని ఏకంగా ఉప నాయకుడిని చేసింది మేనేజ్మెంట్. పైగా అతని మీద నమ్మకం ఉంచింది. ఇటీవల కాలంలో పరుగులు వేగవంతంగా చేయడంలో అతడు ఇబ్బంది పడుతున్నప్పటికీ.. మేనేజ్మెంట్ పనిష్మెంట్ ఇవ్వలేదు. పైగా అతడిని భవిష్యత్తు టి20 నాయకుడిని చేసేందుకు బలమైన అడుగులు వేస్తోంది. జింబాబ్వే టూర్ లో తిలక్ వర్మ గనుక తనను తాను నిరూపించుకుంటే తిరుగుండదు .

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Oktelugu Epaper
Exit mobile version