Photo Story: ఐయామే కాంప్లెన్ బాయ్ అంటూ వచ్చిన ఆ యాడ్ లో నటించిన చిన్నారులు ఎలా ఉన్నారో తెలుసా?

ఐయామ్ ఏ కాంప్లాన్ బాయ్ అంటూ వచ్చే ఈ యాడ్ ను నమ్మేవారు ప్రేక్షకులు. ఈ యాడ్ కూడా అంతలా ఆకట్టుకునేది. ఇంతకీ ఆ యాడ్ గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా. మరి ఆ యాడ్ లో నటించిన చిన్నారులు మీకు గుర్తున్నారా.?

Written By: Swathi, Updated On : May 29, 2024 4:34 pm

Photo Story

Follow us on

Photo Story: సినిమాలను చూసేవారికి సినిమా పజిల్స్ కూడా ఇంట్రెస్ట్ గా ఉంటుంది కదా. జనాలు కూడా ఈ పజిల్స్ ను సాల్వ్ చేయడానికి కాస్త క్యూరియాసిటీతో ఉంటారు.బిజీ మూడ్ లో ఉంటూ కాస్త రిలాక్స్ కోసం ఈ పజిల్స్ సాల్వ్ చేయాలి అనిపిస్తుంటుంది. ఇదెలా ఉంటే చిన్నతనం లో యాడ్స్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉండేవి కదా. 90’s కిడ్స్ మీలో ఉంటే ఈ యాడ్స్ గుర్తుండేవి. అప్పట్లో కాంప్లాన్ యాడ్ చాలా ఫెమస్ అయింది మీకు గుర్తుందా?.. కాంప్లాన్ తాగితే పొడవు పెరుగుతారు అని తెగ చూపించేవారు.

ఐయామ్ ఏ కాంప్లాన్ బాయ్ అంటూ వచ్చే ఈ యాడ్ ను నమ్మేవారు ప్రేక్షకులు. ఈ యాడ్ కూడా అంతలా ఆకట్టుకునేది. ఇంతకీ ఆ యాడ్ గురించి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా. మరి ఆ యాడ్ లో నటించిన చిన్నారులు మీకు గుర్తున్నారా.? ఇందులో నటించిన ఇద్దరు చిన్నారు కూడా ఇప్పుడు స్టార్ హీరో, హీరోయిన్ అయ్యారు అంటే నమ్ముతారు. అవును మీరు విన్నది నిజమే. ఇంతకీ వారు ఎవరంటే..

ఆ యాడ్ లో అన్న చెల్లెళ్లుగా నటించిన ఆ ఇద్దరూ హీరో, హీరోయిన్ గా సినిమాల్లో కూడా నటించారు. ఇంతకు పై ఫొటోలో ఉన్న ఇద్దరూ ఎవరో కనిపెట్టండి చూద్దాం. ఆ అబ్బాయి ఎవరో కనిపెట్టడం కొంచం ఈజీనే కానీ హీరోయిన్ ను మాత్రం గుర్తుపట్టడం కష్టమే కదా.ఇందులో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్. ఆ చిన్నారి ఎవరో కాదు హాట్ బ్యూటీ అయేషా టాకియా.

షాహిద్ కపూర్ హీరోగా బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే అయేషా టాకియా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీ అయింది. తెలుగులో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాలో మెరిసింది ఈ అమ్మడు. ఆ తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది. అయేషా, షాహిద్ కలిసి దిల్ మాంగే మోర్ అనే సినిమాలో కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు.