Telugu Movies: మన వాళ్ళు ఎంత సేపు విదేశీ సినిమాల మోజులోనే ఉంటారు గానీ, విదేశీయులకు కూడా తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే కొన్ని సినిమాలను మన దర్శకనిర్మాతలు తీశారని ఈ తరం ప్రేక్షకులకు తెలియదు. మరి ఆ సినిమాలు ఏమిటో చూద్దాం.

పడమటి సంధ్యా రాగము
విదేశీయులకు ఇష్టమైన సినిమా ఇది. ఈ సినిమా ద్వారా భారత సంస్కృతి, తెలుగు సంస్కృతీ రెండూ తెలుసుకునే అవకాశం చిక్కుతుంది. అదీ పాశ్చాత్య సంస్కృతిలో. అందుకే విదేశీయులు ఈ సినిమాని చూస్తూ ఉంటారు.
సీతారామయ్య గారి మనవరాలు
ఇదీ పాశ్చాత్యులు వారిని మనమరాలి పాత్రతో పోల్చుకోవచ్చు.
ఆదిత్య 369 .
బ్యాక్ టు ఫ్యూచర్ ని చూసి తీసినా దానికంటే మెరుగైన చిత్రం. ఆంధ్ర భోజుడిని ఆ వైభవాన్ని చూడొచ్చు. హంపీ ఆ కాలంలో ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నగరం. విస్తీర్ణంలోనూ జనాభాలోనూ. అత్యంత ధనిక నగరం కూడానూ. దురదృష్టవశాత్తు మనం మన వైభవాన్ని మరచిపోయేలా చేశారు మన నాయకులు.
అందాల రాముడు,గోదావరి.
తెలుగు ప్రాంతం అంటేనే వృద్ధ గంగ గోదావరి. గంగ కన్నా ముందు నుండి ప్రవహిస్తున్న నది. ఆ నది మీద సాగే ప్రయాణం. చివర్లో దక్షిణ అయోధ్య అయిన భద్రాద్రి యాత్ర చూడాల్సిందే !
శంకరాభరణం.
మన కళలకు ఇచ్చే విలువే కాదు, అసలు ఈ కథ సమాజంలోని అసమానతల మీద కూడా.
స్వాతి ముత్యం .
ఫారెస్ట్ గంప్ అనే ఆస్కార్ చిత్రానికి ఇదే ప్రేరణ అంటారు.
యమ గోల.
హక్కుల వ్యవహారంలో, పత్రికా స్వేచ్ఛలో వెనుక బడిపోయాం అనే విదేశీయులకి తప్పకుండా చూపించి తీరవలసిన చిత్రం.
Also Read: మరోసారి మంచి మనసు చాటుకున్న బండ్ల గణేష్… నేపాల్ పాపను దత్తత
ఘటోత్కచుడు
టెక్నాలజీనీ పౌరాణికాలనీ కలపిన సినిమా.
అనుకోకుండా ఒక రోజు
ఇక్కడి కల్ట్స్ ఎలా ఉంటాయో వాటి ఉచ్చులో ఎలా పడకుండా ఉండాలో తెలుసుకోవచ్చు . మంచి గురువును ఎంపిక చేసుకుంటారు.
ఆది శంకరాచార్య –
సంస్కృత భాషా చిత్రం. సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కానీ విదేశీయులకు భారతీయ ఆధ్యాత్మికత వైపు దారి చూపించవచ్చు. ఇక్కడి ప్రజాస్వామ్యం అర్థం అవ్వాలంటే లీడర్ చిత్రాన్ని చూపించవచ్చు. ఇది ముళ్ళపూడి వారి కథను పోలి ఉంటుంది. ఇక్కడి మూర్ఖత్వాన్నీ ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకోలేని ప్రజల చేతకానితనాన్ని పరిచయం చేయటానికి అపరిచితుడు చాలు . మిస్సమ్మ,పెళ్ళి పుస్తకం, ఆనంద్ ఇక్కడి పెళ్ళి వ్యవహారాలూ , విలువల గురించి చెప్పే సినిమాలు.