Bigg Boss 6- Srihan: శ్రీహాన్‌ ఎఫైర్స్ బయటపెట్టిన `బిగ్‌ బాస్` కంటెస్టెంట్.. దుమారం

Bigg Boss 6- Srihan: బిగ్ బాస్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇనాయా సుల్తానా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అమ్మడు అప్పట్లో రాంగోపాల్ వర్మతో కలిసి చేసిన రోమాన్స్ వీడియోలతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వచ్చాక అందరితో గొడవలు పెట్టుకుంటూ తండ్రి సెంటిమెంట్ ను రాజేస్తూ ఏడుస్తూ ఫోకస్ అవుతోంది. అందరి కంటే వివాదాస్పద లేడీగా ముద్ర పడిపోయింది. ఫలితంగా ఇనాయా హైలెట్ అవుతోంది. బిగ్ బాస్ ప్రారంభమైనప్పటి నుంచి […]

Written By: NARESH, Updated On : September 10, 2022 7:29 pm
Follow us on

Bigg Boss 6- Srihan: బిగ్ బాస్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇనాయా సుల్తానా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ అమ్మడు అప్పట్లో రాంగోపాల్ వర్మతో కలిసి చేసిన రోమాన్స్ వీడియోలతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వచ్చాక అందరితో గొడవలు పెట్టుకుంటూ తండ్రి సెంటిమెంట్ ను రాజేస్తూ ఏడుస్తూ ఫోకస్ అవుతోంది. అందరి కంటే వివాదాస్పద లేడీగా ముద్ర పడిపోయింది. ఫలితంగా ఇనాయా హైలెట్ అవుతోంది.

Srihan

బిగ్ బాస్ ప్రారంభమైనప్పటి నుంచి గొడవలు పెట్టుకుంటున్న ఇనాయా సుల్తానానే బిగ్ బాస్ టీం టార్గెట్ చేసింది. మొదట గీతూతో ఇనాయా లొల్లిపెట్టుకుంది. అనంతరం ఆదిరెడ్డితో వాగ్వాదానికి దిగింది. తనకు ఎవరూ సపోర్టు చేయడం లేదని ఇంట్లో గోలగోల చేసి ఏడ్చేసింది. తోటి కంటెస్టెంట్లపై విరుచుకుపడింది.

ఇక నిన్న వరెస్ట్ పర్ ఫామెన్స్ ఎవరు అన్న సందర్భంగా బాలాదిత్య, శ్రీహాన్ సహా కొంత మంది ఇనాయా సుల్తానా పేరు చెప్పారు. బాలాదిత్య తన పేరు చెప్పడంపై ఇనాయా అభ్యంతరం తెలిపింది. కారణం లేకుండా తనను నామినేట్ చేయవద్దంటూ హితవు పలికింది. ఇక శ్రీహాన్ పై కూడా విరుచుకుపడింది.

అనంతరం బెడ్ రూంలో శ్రీహాన్, ఇనియా మధ్య వాగ్వాదం నడిచింది. నేను సింగిల్ గా వచ్చాను.. సింగిల్ గా వెళతానని.. నాకు ఎవరి సపోర్ట్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఒంటరిగా పోరాడుతున్నానని ఇనాయా తెలిపింది. సెల్ఫ్ గా అప్పీలు చేసుకుటానని అన్నది. ఇక అనంతరం శ్రీహాన్ పర్సనల్ విషయాలను ఎత్తి చూపించింది. ‘ నీకు బయట నీ ప్రియురాలు సిరి ఉంది. ఇంకా ఎవరెవరో ఉన్నారు’ అంటూ సంచలన కామెంట్స్ చేసింది.దీనికి శ్రీహాన్ గట్టి వార్నింగ్ లు ఇచ్చాడు. నా వ్యక్తిగత జీవితం గురించి తీయవద్దంటూ హితవు పలికాడు.

గత బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న సిరి అప్పుడే శ్రీహాన్ తో ప్రేమలో ఉన్నట్టు తెలిపింది. శ్రీహాన్ హౌస్ లోకి వచ్చి మరీ వీరిద్దరి ప్రేమను బయటపెట్టాడు.ఇప్పుడు శ్రీహాన్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అతడికి సిరి, సహా కొంతమంది సపోర్టుగా నిలుస్తున్నారు. అందుకే ఇనాయా ఆ మాటలన్నట్టు తెలుస్తోంది.

Tags