Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో విష్ణు ప్రియ వన్ సైడ్ లవ్ ట్రాక్ చూసే ఆడియన్స్ కి రకరకాలుగా అనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక ఆడపిల్ల అబ్బాయి వెనుక ఈగో ని కూడా చంపుకొని ఇంతలా అతని వెంట తిరగడం బహుశా మనం సినిమాల్లో మాత్రమే చూసుంటాము, నిజ జీవితంలో ఇలాంటివి జరగడం చాలా తక్కువ. పోనీ విష్ణు ప్రియ కంటెంట్ కోసం డ్రామాలు చేస్తుందా అంటే, అది కూడా లేదు. పృథ్వీ ని నిజంగానే ప్రేమిస్తుంది. తనకి అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవని పృథ్వీ ఇంతకు ముందు విష్ణు ప్రియ కి క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా అతని వెంటే తిరుగుతూ ఉన్నింది విష్ణు ప్రియ. పృథ్వీని ఎవరైనా ఏమైనా అంటే, పృథ్వీ కి కూడా కోపం రాదేమో, కానీ విష్ణు ప్రియ కి వచ్చేస్తుంది.
ఈ వారం నామినేషన్స్ కూడా పృథ్వీ ని గత వారం ప్రేరణ నామినేట్ చేసింది అనే కోపంతోనే, ఈ వారం ప్రేరణకి నామినేషన్ వేసింది. అలాగే బ్యాటరీ వెర్సస్ ఛార్జర్స్ టాస్క్ లో కూడా ఆమె పృథ్వీ కోసమే ఆడుతూ వచ్చింది. సొంత గేమ్ కనిపించలేదు. అతనికి సిగరెట్ తాగే అలవాటు ఉండడంతో, లైటర్ కోసం రాయల్ క్లాన్ సభ్యులను బ్రతిమిలాడింది. ఇలా ఆమె హౌస్ ఏమి చేసినా పృథ్వీ కోసమే చేస్తున్నట్టుగా లోపల ఉన్న హౌస్ మేట్స్ కి మాత్రమే కాదు, బయట చూసే ప్రేక్షకులకు, ఆమెకి ఓట్లు వేసే అభిమానులకు కూడా అనిపించింది. గేమ్స్ బాగా ఆడాలని, టైటిల్ కొట్టాలని కసి ఈమెలో ఇంచు కూడా లేదు. అందుకే ఆమె ఓటింగ్ గ్రాఫ్ భారీగా పడిపోయింది.
ఇప్పుడు ఆమె కనీసం టాప్ 5 లోకి అయినా వస్తుందా అంటే అనుమానమే. ఇదంతా పక్కన పెడితే నిన్న పృథ్వీ విష్ణు ప్రియ ముఖం మీదనే, నాకు నీ మీద ఇంట్రెస్ట్ లేదు, స్నేహితులుగా ఉందాము, అంతకు మించి వేరే ఫీలింగ్స్ ఏవైనా ఉంటే మాత్రం ఇక్కడితో కట్ చెయ్యి, మనం ఇక మీదట మాట్లాడుకోవద్దు అని చెప్తాడు. పాపం ఈ మాటలకు విష్ణు ప్రియ కి గుండెలు బద్దలైనట్టు అనిపించింది. ఇదంతా యష్మీ చెప్పడం వల్లే పృథ్వీ అలా చేసాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న విష్ణు, నేరుగా యష్మీ దగ్గరకు వెళ్లి అడుగుతుంది. అప్పుడు యష్మీ ‘వాడి గేమ్ లో కూడా నువ్వే కనిపిస్తున్నావు, వాడు కనిపించడం లేదు’ అని చెప్తుంది. అప్పుడు విష్ణుప్రియ నేను అతనితో ఉండడం వల్లే అతన్ని ఎక్కువగా చూపిస్తున్నారని బయట నుండి వచ్చిన వైల్డ్ కార్డ్స్ చెప్పారు అంటూ చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ. ఇదంతా పక్కన పెడితే ఇంత జరిగినప్పటికీ కూడా విష్ణు ప్రియ పృథ్వీ కాళ్ళు నొక్కడం, అతని గురించి గొప్పగా మాట్లాడడం వంటివి చేస్తుంది. ఇదంతా చూసిన ఆడియన్స్ పాపం విష్ణు ప్రియ ఏమైపోతుందో, రాబోయే రోజుల్లో పిచ్చిది అయిపోతుందేమో అని బాధపడుతున్నారు.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Bigg boss telugu 8 vishnupriya made shocking comments on prithvi
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com