https://oktelugu.com/

Bigg Boss Telugu 8: ఒక్క ఎపిసోడ్ తో మారిపోయిన సీన్..ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ అతనే..సోనియా వల్లే ఇదంతా!

గత వారం రోజుల నుండి హౌస్ లో కంటెస్టెంట్స్ టాస్కులు ఆడారు, కానీ ఎలాంటి టాస్కులు ఆడారు అనే విషయం గుర్తుకు రావడం లేదు. కానీ గొడవలు మాత్రం బాగా గుర్తు ఉంటున్నాయి.ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నిఖిల్, పృథ్వీ రాజ్, విష్ణు ప్రియా, నాగ మణికంఠ, శేఖర్ బాషా, నైనిక, ఆదిత్య ఓం కిరాక్ సీత నామినేట్ అయ్యారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 11, 2024 / 08:15 AM IST

    Bigg Boss Telugu 8(6)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ అట్టహాసంగా ప్రారంభమై అప్పుడే వారం రోజులు పూర్తి అయ్యింది. మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. కంటెస్టెంట్స్ ఈమెని బాగా మిస్ అవుతున్నారు. ఎందుకంటే హౌస్ లో ఉన్నవారిలో కాస్తో కూస్తో వంట బాగా చేసేది ఆమె మాత్రమే. మిగిలిన వాళ్ళందరూ ఎదో అలా ట్రై చేస్తారు అంతే. అయితే హౌస్ లో కేవలం 13 మంది మాత్రమే ఉండడం వల్ల గేమ్స్ అనుకున్నంత స్థాయిలో లేవు. ఈ షో ప్రారంభానికి ముందుకు స్టార్ మా ఛానల్ లో ‘కిరాక్ బాయ్స్..కిలాడీ లేడీస్’ అనే షో ప్రసారమయ్యేది. ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఈ గేమ్ షోలో టాస్కులు అదిరిపోయేవి. ఇక్కడే టాస్కులు ఇలా ఉన్నాయంటే, ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో ఏ రేంజ్ టాస్కులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో నెటిజెన్స్ నుండి కామెంట్స్ కూడా వినిపించేవి.

    కానీ ఆ గేమ్ షోలో పెట్టిన గేమ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు పావు శాతం కూడా పెట్టట్లేదు బిగ్ బాస్. గత వారం రోజుల నుండి హౌస్ లో కంటెస్టెంట్స్ టాస్కులు ఆడారు, కానీ ఎలాంటి టాస్కులు ఆడారు అనే విషయం గుర్తుకు రావడం లేదు. కానీ గొడవలు మాత్రం బాగా గుర్తు ఉంటున్నాయి.ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నిఖిల్, పృథ్వీ రాజ్, విష్ణు ప్రియా, నాగ మణికంఠ, శేఖర్ బాషా, నైనిక, ఆదిత్య ఓం కిరాక్ సీత నామినేట్ అయ్యారు. 13 మంది కంటెస్టెంట్స్ లో 8 మంది నామినేట్ అవ్వడం సాధారణమైన విషయం కాదు. వీరిలో ప్రేక్షకులందరూ కిరాక్ సీత ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ ఓటింగ్ లైన్ ఈసారి నిమిషానికి ఒకలాగా ట్రెండ్ మారుతుంది. నిన్నటి వరకు కిరాక్ సీత, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్ సరిసమానమైన ఓటింగ్ తో టేబుల్ బాటమ్ లో ఉండేవారు.

    ఇప్పుడు కిరాక్ సీత, ఆదిత్య ఓం ఓటింగ్ కాస్త పెరిగింది, కానీ పృథ్వీ రాజ్ ఓటింగ్ మాత్రం అందరి కంటే చివరి స్థానంలోకి పడిపోయింది. పరిస్థితి చూస్తూ ఉంటే ఆ ఓటింగ్ గ్రాఫ్ మళ్ళీ లేచేలా కనిపించడం లేదు. ఎందుకంటే షో చాలా సాదాసీదాగా నడిచిపోతుంది. ఒకవేళ పృథ్వీ రాజ్ ఎలిమినేట్ అయితే, అది చాలా అన్యాయమైన ఎలిమినేషన్ అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే పృథ్వీ రాజ్ బలంగా టాస్కులు ఆడుతున్నాడు, తనని తాను డిఫెండ్ చేసుకోవడంలో సక్సెస్ అవుతున్నాడు. కాబట్టి ఇలాంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం వల్ల బిగ్ బాస్ టీఆర్ఫీ రేటింగ్స్ తగ్గిపోతాయని అంటున్నారు. ప్రస్తుతం ఓటింగ్ లైన్ లో నిఖిల్ అందరికంటే అత్యధిక ఓట్లతో టాప్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు.