https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నిఖిల్ చాలా వీక్ కంటెస్టెంట్ అంటున్న హౌస్ మేట్స్..ఒంటరిగా మిగిలిపోయిన నిఖిల్!

పలు సీరియల్స్ లో ఆయన హీరో గా నటించాడు, అనేక రియాలిటీ షోస్ లో ఆయన అద్భుతంగా టాస్కులు ఆడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అర్జున్ అంబటి, అమర్ దీప్ వంటి కంటెస్టెంట్స్ కి ఇతను బాగా క్లోజ్. దీంతో కచ్చితంగా నిఖిల్ కూడా వారిలాగానే ఫైర్ బ్రాండ్ గా హౌస్ లో ఉంటాడని అందరూ అనుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 11, 2024 / 08:06 AM IST

    Bigg Boss Telugu 8(5)

    Follow us on

    Bigg Boss Telugu 8:  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ ప్రారంభం బాగానే ఉంది కానీ, రోజులు గడిచే కొద్దీ షో గ్రాఫ్ పడిపోతూ ఉంది. చూస్తుంటే ప్రస్తుతం నడుస్తున్న సీజన్ కంటే, ఫ్లాప్ సీజన్ గా పిలవబడిన సీజన్ 6 ఎంతో బెటర్ గా ఉందని అంటున్నారు ప్రేక్షకులు. కంటెస్టెంట్స్ కి నామినేషన్స్ కి తగ్గ పాయింట్స్ కూడా దొరకడం లేదు. గత వారం రోజులుగా అలాంటి సంఘటనలు హౌస్ లో జరిగాయి అన్నమాట. టాస్కులు తక్కువ, గొడవలు ఎక్కువ..నిఖిల్ – సోనియా – పృథ్వీ రాజ్ లవ్ ట్రాక్ తిప్పడం కోసం ఈ షోని నడుపుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ లో నిఖిల్ ఉన్నాడు అనగానే ఆడియన్స్ లో చాలా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే నిఖిల్ మంచి టాలెంట్ ఉన్న అబ్బాయి.

    పలు సీరియల్స్ లో ఆయన హీరో గా నటించాడు, అనేక రియాలిటీ షోస్ లో ఆయన అద్భుతంగా టాస్కులు ఆడుతూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా అర్జున్ అంబటి, అమర్ దీప్ వంటి కంటెస్టెంట్స్ కి ఇతను బాగా క్లోజ్. దీంతో కచ్చితంగా నిఖిల్ కూడా వారిలాగానే ఫైర్ బ్రాండ్ గా హౌస్ లో ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఇతనికి ఉన్న అతి మంచితనం లక్షణం వల్ల, అందరూ హౌస్ లో నిఖిల్ ని చాలా తేలికగా ఆడేసుకుంటున్నాడు. కనీసం నామినేషన్స్ పాయింట్స్ కూడా బలంగా చెప్పలేనంత వీక్ కంటెస్టెంట్ నిఖిల్ అని జనాలు ఊహించలేదు. ఈయనకు సపోర్టు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఇలా ఉన్నాడేంటి, ఎదో ఊహించుకుంటే ఇంకేదో అయ్యింది అని అనుకుంటున్నారు. ముఖ్యంగా సోనియా నిఖిల్ గేమ్ మొత్తాన్ని నాశనం చేసేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె మాట్లాడే మాటలకు చాలా తేలికగా వలలో పడిపోతున్నాడు.

    ఆమె ఏది చెప్తే అదే అనుసరించడం, ఆమె మీద ఎన్నో నామినేషన్స్ పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా ఆమె జోలికి పోకుండా పృథ్వీ జోలికి పోవడం అసలు ఇతను ఏమి చేస్తున్నాడో హౌస్ లో కంటెస్టెంట్స్ కి కూడా అర్థం కానీ పరిస్థితి. పాపం ప్రేరణ ఒక స్నేహితురాలిగా సలహా అడిగేందుకు వస్తే, ఆ సలహా కి సమాధానం నేడు నామినేషన్ పాయింట్ కోసం వాడుకున్నాడు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో ఆయనకీ నామినేషన్ పాయింట్స్ ఎవరి మీద దొరకక పోయేసరికి తనని తాను సెల్ఫ్ నామినెటే చేసుకునే పరిస్థితి కి కూడా వచ్చేసాడు. పాపం ఇతని స్నేహితులు అర్జున్ అంబటి, అమర్ దీప్ వంటి వారు బయట నుండి నిఖిల్ గేమ్ చూసి ఇలా అయిపోయాడేంటి అని ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇదంతా పక్కన పెడితే ఈ ఎపిసోడ్ లో ఆయన సోనియా కి దూరంగా ఉంటూ వచ్చాడు. చిన్నగా బాగుపడే లక్షణాలు వస్తున్నాయి, భవిష్యత్తులో ఎలా ఆడుతాడో చూడాలి.